Homeక్రైమ్‌Maharashtra: బావిలో శవాలు.. విచారణ చేస్తుంటే పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది..

Maharashtra: బావిలో శవాలు.. విచారణ చేస్తుంటే పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది..

Maharashtra: అది తాగునీటి బావి. ఆ బావిలో ఉన్నట్టుండి శవాలు కనిపించాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారు రంగంలోకి దిగారు. ఏం జరిగిందని ఆరా తీశారు. విచారణ జరుపుతున్నా కొద్దీ దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

Also Read: ప్రపంచ జనాభాలో 11 శాతం మంది ఒకే సన్నని పట్టీపై జీవిస్తున్నారని మీకు తెలుసా?

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది.. ఈ సంఘటన ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈనెల 25న నాందేడ్ ప్రాంతంలోని గోలైగావ్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను కలవడానికి ఆమె ప్రియుడు వెళ్ళాడు. వారిద్దరూ శారీరకంగా కలిశారు. శారీరకంగా వారిద్దరు అనుచితమైన పరిస్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు చూశారు. వెంటనే ఆ విషయాన్ని ఆ వివాహిత తండ్రికి చెప్పారు. వివాహిత తండ్రి మరో ఇద్దరితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిని దారుణంగా కొట్టారు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఆ మహిళ భర్త కూడా అక్కడే ఉన్నాడు.. దెబ్బలకు తట్టుకోలేక వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వారి మృతదేహాలను వేరే ప్రాంతానికి తరలించాలి అనుకున్నారు. తర్వాత మనసు మార్చుకొని సమీపంలో ఉన్న తాగునీటి బావిలో వేశారు.

బావిలో మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.. ఆ తర్వాత బావిలో నుంచి ఆ మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు. ఆ యువకుడి మృతదేహాన్ని తీవ్రంగా వెలికి తీస్తే తప్ప బయటపడలేదు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత.. తీవ్ర గాయాలను పోలీసులు గుర్తించారు. ముఖం, మర్మంగాలపై తీవ్రమైన గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసులో మృతురాలి తండ్రి, భర్త, ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు…

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version