Students Two Wheelers Theft: వారిదంతా నూనూగు మీసాల వయసు. పైగా చదివేది ఇంజనీరింగ్. తల్లిదండ్రులు ఎంతో ఖర్చుపెట్టి వారిని కాలేజీకి పంపిస్తున్నారు.. కోరినవన్నీ సమకూర్చుతున్నారు.. అడిగినవన్నీ ఇచ్చేస్తున్నారు. తన పిల్లలు గొప్పగా చదువుకొని గొప్ప స్థానాలలో ఉంటారని కలలు కంటున్నారు.. కాని వారు మాత్రం కన్నవాళ్ళ కలల్ని.. పెంచుకున్న ఆశలను తుంచేస్తున్నారు.
Also Read: మోడీ నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా అద్దంకిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఒక ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. వివిధ రకాల ధ్రువపత్రాలు ఇవ్వమని అతని అడిగారు. దానికి అతడు నిరాకరించాడు. పైగా పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులకు అనుమానం బలపడింది. దీంతో ఆ యువకుడిని పట్టుకొని విచారించడం మొదలుపెట్టారు.. తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు.. అతడు చెప్పిన వివరాలు పోలీసులను ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. ఆ యువకుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు లోతుల్లోకి వెళితే అసలు బాగోతం బయటపడింది.
ఆ యువకుడు చదివేది ఇంజనీరింగ్. అతడితోపాటు మిగతా ఆరుగురు నిందితులు ద్విచక్ర వాహనాలను దొంగిలించడం మొదలుపెట్టారు. వీరంతా కూడా యూట్యూబ్ చూస్తూ బైక్ ల తాళాలు ఎలా తీయాలో యూట్యూబ్ చూస్తూ నేర్చుకున్నారు.. ఇప్పటివరకు 16 బుల్లెట్ బండ్లు, ఒక స్కూటీని దొంగిలించారు. వీటి విలువ 25.20 లక్షలు గా ఉందని పోలీసులు చెబుతున్నారు.. ఆరుగురు నిందితులలో ఒకరు కందుకూరులో, మిగతావారు బీటెక్ చదువుతున్నారు.. దొంగిలించిన బుల్లెట్ బండ్లను వారు విక్రయించడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా ఇటీవల అద్దంకి జిల్లాలో పోలీసులు ద్విచక్ర వాహనాలను విక్రయించే వారిపై నిఘా పెట్టారు. వారికి కఠిన నిబంధనలు విధించారు. దీంతో ఆ యువకులు ద్విచక్ర వాహనాలను విక్రయించలేకపోయారు.
“చదువుకోవాల్సిన విద్యార్థులు దారి తప్పారు. చదువును పక్కనపెట్టి యూట్యూబ్లో ద్విచక్ర వాహనాల తాళాలు ఎలా తీయాలో నేర్చుకున్నారు. ఏకంగా బుల్లెట్ బండ్లనే టార్గెట్ చేసుకున్నారు. బుల్లెట్ బండ్లను దొంగిలించి విక్రయించాలనుకున్నారు.. కాకపోతే వారి ప్రణాళిక బెడిసి కొట్టింది. చివరికి ఇలా దొరికిపోయారు.. వారిని అరెస్ట్ చేసి హాజరు పరిచామని” పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ విద్యార్థులు చదువుతున్న కాలేజీ యాజమాన్యం స్పందించింది. వారిపై చర్యలకు తీసుకోవడానికి సమాయత్తమైంది.