https://oktelugu.com/

Tirupati: ఆ చిట్టి తల్లిని అలా చూస్తే గుండె తరుక్కుపోతుంది.. నువ్వు మనిషిగా ఎలా పుట్టావ్ రా!

వాడికి(ఇలా రాస్తున్నందుకు పాఠకులు క్షమించాలి) చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోయారు. పెదనాన్న వద్ద పెరుగుతున్నాడు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చుతున్నాడు. అలాంటి వ్యక్తి చదువుకొని బాగుపడాల్సింది పోయి.. దారుణానికి పాల్పడ్డాడు. ఓ చిన్నారిని చిదిమేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 4, 2024 / 09:20 AM IST

    Tirupati(1)

    Follow us on

    Tirupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలానికి చెందిన ఓ మహిళను కేవీబీ పురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇచ్చి కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. వారి ప్రేమకు గుర్తుగా సరిగ్గా మూడు నెలల సంవత్సరాల క్రితం ఒక కుమార్తె జన్మించింది. ఏడాదిన్నర క్రితం ఒక బాబు పుట్టాడు. సొంత ఊరిలో ఉపాధి లేకపోవడంతో వారు పిల్లలతో సహా వడమాల పేట మండలానికి వచ్చారు. అద్దె ఇంట్లో దిగారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటున్నారు. వారికి ఇంటికి సమీపంలో సుశాంత్ అలియాస్ నాగరాజు (23) అనే యువకుడు ఉంటూ ఉండేవాడు. అతడు తన పెదనాన్న చెంచయ్య దగ్గర ఉండేవాడు. నాగరాజు కు తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పుడే వ్యసనాలకు బానిసగా మారాడు. దీంతో అతడిని చెంచయ్య బయటికి పంపించాడు. అయితే అతడు చెంచయ్య కుమారుడు వెంకటేష్ దగ్గర కొంతకాలంగా ఉంటున్నాడు.

    అక్కా, బావ అని పిలిచి…

    నాగరాజు ఆ చిన్నారి తల్లిదండ్రులను అక్కా బావ అని పిలిచేవాడు.. అయితే నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం విపరీతంగా మద్యం తాగాడు.. ఆ మైకంలో చాలాసేపు ఆ ఊరు మొత్తం తిరిగాడు. అనంతరం ఆ మూడున్నర సంవత్సరాల చిన్నారి తల్లి వద్దకు వచ్చాడు. అంతకుముందే ఆ చిన్నారి తండ్రి తన బావమరిదికి కాలు విరగడంతో కట్టు కట్టించడానికి తీసుకువెళ్లాడు. ఇదే అదునుగా నాగరాజు ఆ పాపకు చాక్లెట్లు కొనిపిస్తానని ఆమె తల్లికి చెప్పి తీసుకువెళ్లాడు. అయితే పాప ఎంతసేపటికి ఇంటికి రాలేదు. ఇదే క్రమంలో నాగరాజును ఆమె నిలదీసింది. దానికి అతడు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆ చిన్నారి ఆచూకీ కోసం వారంతా ఆ ప్రాంతం మొత్తం తిరిగారు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. ఆ తర్వాత అతడిని వారి శైలిలో విచారించారు. ఈ క్రమంలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ చిన్నారిని స్థానికంగా ఉన్న ఒక పాఠశాల ఆట స్థలం పక్కన పూడ్చిపెట్టాడు. ఆ చిన్నారిపై అతడు తాగిన మైకంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని చంపేశాడు. పాఠశాల పక్కనే ఉన్న వంకలో ఆ బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, బాధిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం అందించింది. హోం మంత్రి అనిత ఆదివారం రాత్రి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వాన్ని ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని బాధిత చిన్నారి మాతృమూర్తికి అందించారు. ఆమెను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తాను చూస్తానని ఆమె వారికి భరోసా ఇచ్చారు.