https://oktelugu.com/

Crime News : సాఫ్ట్‌వేర్‌ను మింగిన సంప్‌.. రెప్పపాటులో ఘోరం..!

అక్మల్‌ పడిపోయినట్లు గుర్తించి బయటకు తీసే ప్రయత్నం చేశాడు. వీలు కాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీయించారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2024 / 03:35 PM IST

    crime News

    Follow us on

    Crime News : వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేదు. అలాగే ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో.. ఏ రూపంలో వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు. ఏమరుపాటుగా ఉంటే.. ప్రాణాలే పోతాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక మరికొన్ని ప్రమాదాలు ఎదుటివారి నిర్లక్ష్యంతో జరుగుతుంటాయి. కొన్నిసార్లు చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలే పోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ చిన్న నిర్లక్ష్యం ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రాణాలు తీసింది. హాస్టల్‌ ఓనర్‌ నిర్లక్ష్యంతో సంపు సాఫ్ట్‌వేర్‌ను మింగేసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ కొండాపూర్‌లో జరిగింది. క్షణ కాలంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    ఏం జరిగిందంటే..
    ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతానికి చెందిన అక్మల్‌ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇక అక్మల్‌కు జిమ్‌ చేసే అలవాటు ఉంది. ఉదయమే జిమ్‌కు వెళ్లి వస్తుంటాడు. రోజు మాదిరిగానే ఆదివారం(ఏప్రిల్‌ 21న) కూడా జిమ్‌కు వెళ్లి హాస్టల్‌కు తిరిగి వచ్చాడు. గేట్‌ ఓపెన్‌ చేసుకుని లోపలికి వస్తున్న సమయంలో కింద చూసుకోకుండా ముందుకు నడిచాడు. రెండు అడుగుల దూరంలోనే ఉన్న సంప్‌ పైకప్పు ఓపెన్‌చేసి ఉంది. దానిని చూసుకోకుండా నడవడంతో రెప్పపాటులో అందులో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. దీంతో ఎవరూ గమనించలేదు. సంపులో పడిన వెంటనే అక్మల్‌ తలకు బలమైన గాయం కావడంతో అందులోనే మృతిచెందాడు.

    కాసేపటి తర్వాత చూసిన ఓనర్‌..
    కాసేపటి తర్వాత కిందకు వచ్చిన హాస్టల్‌ ఓనర్‌.. సంప్‌ను గమనించాడు. కానీ అందులో అక్మల్‌ పడిపోయినట్లు గుర్తించలేదు. మరికాసేపలయ్యాక ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో లోపలికి తొంగిచూశాడు. అక్మల్‌ పడిపోయినట్లు గుర్తించి బయటకు తీసే ప్రయత్నం చేశాడు. వీలు కాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీయించారు.

    పూర్తిగా నిర్లక్ష్యమే..
    అక్మల్‌ సంపులో పడిపోయిన దృశ్యం, తర్వాత అతడిని ఓనర్‌ బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నం దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ సీసీ ఫుటేజీ ఇపుపడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సంపు పైకప్పు తెరిచిన ఓనర్‌.. అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. మరోవైపు బయట నుంచి వస్తున్న అక్మల్‌ కూడా ఏదో ఏమరుపాటుగా ముందుకు నడిచాడు. ఇందులో యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అక్మల్‌ పడిన విషయం ఎవరూ గమనించకపోవం కూడా మరణానికి కారణమైంది.