Crime News : అనుమానం: భార్యను కొట్టి ప్రైవేట్ పార్ట్‌కు తాళం..

అక్కడ ఆమెకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. ఐదు రోజుల తర్వాత గురువారం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ఆ మహిళ ధైర్యం చేసి తన భర్తపై వాకాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Written By: NARESH, Updated On : May 20, 2024 11:59 am

Wife, Husband

Follow us on

Crime News : ఆడవారిపై అమానుష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో వార్త సోషల్ మీడియాలో, మేయిన్ స్ట్రీమ్ మీడియాలో వింటూనే ఉన్నాం. ముఖ్యంగా భార్యలతో భర్తలు ప్రవర్తించే విధానం మరింత ఆందోళనకరంగా ఉంటుంది. ఇటీవల బయటపడిన అమానవీయ ఘటన మహిళలతో పాటు పురుషులకు కూడా ఆందోళన కలిగించింది.

వాకాడ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బాలాజీ మేటే IANS మాట్లాడుతూ.. ‘ఉపేంద్ర హుడా (30) కే నేపాల్‌లోని ఒక గ్రామానికి చెందినవారు. వివాహితుడైన ఆయన తన భార్య (28)తో కలిసి మే ప్రారంభంలో పూణేకు వచ్చాడు. వాచ్ మన్ పని చేసేందుకు ఇక్కడకు వచ్చాడు. ఉపేంద్ర సోదరి కూడా ఇక్కడే ఉండడంతో వారి సమీపంలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని భార్యా భర్తలు ఉంటున్నారు.

మే 11వ తేదీ రాత్రి ఉపేంద్ర హుడాకే విపరీతంగా మద్యం తాగి వచ్చాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెపై దాడి చేశాడు. చంపుతానని కత్తితో బెదిరించాడు. ఉపేంద్ర చేసిన ఆరోపణలను ఆయన భార్య ఖండించింది. ఆమెను తను తప్పుచేయలేదని ఎంత చెప్పినా వినకుండా.. దాడి చేస్తూనే ఉన్నాడు. నేతపై పడేసి మరీ దాడి చేశాడు.

నిస్సహాయంతో రక్తపు మడుగులో ఉన్న ఆమె సాయం కోసం కేకలు వేయడంతో ఉపేంద్ర హుడాకే పదునైన బ్లేడ్ తో ఆమె జననాంగాలకు రెండు వైపులా రెండు రంధ్రాలు చేసి, ఇనుప స్క్రూలు వేసి తాళం వేశాడు. తాళం చెవి కూడా విసిరి పారేశాడు.

ఉపేంద్ర భార్య ఆర్థ నాదాలు విన్న పొరుగున ఉన్న కూలి లలిత్ పరిహార్ ఆమె ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ తీవ్ర రక్త స్రావంలో ఉన్న మహిళను చూసిన ఆయన సాయం కోసం మరికొంత మందిని పిలిచాడు. సమీపంలోని నేపాలీలతో సహా చుట్టుపక్కల నుంచి చాలా మంది ఉపేంద్ర హుడాకే ఇంటికి చేరుకున్నారు. పాక్షిక స్పృహలో ఉన్న ఆమెను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.

అక్కడ ఆమెకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. ఐదు రోజుల తర్వాత గురువారం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ఆ మహిళ ధైర్యం చేసి తన భర్తపై వాకాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

‘మేము ఉపేంద్ర చేసింది క్రూరమైన నేరంగా పరిగణించాం. తక్షణమే నిందితుడు ఉపేంద్ర హుడాకేను అరెస్ట్ చేశాం. అతన్ని వాకాడ్ కోర్టు ఎదుట హాజరుపరిచాం. కోర్టు అతన్ని రెండు వారాల మెజిస్ట్రియల్ కస్టడీకి ఇచ్చింది’ అని మేటే చెప్పారు.

ఉపేంద్ర హుడాకేపై IPC సెక్షన్ 323, 506(2), ఇతర నేరాల కింద కేసులు నమోదు చేశాం. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మెటే తెలిపారు.