Devara Fear Song: అనిరుధ్ ఈ రెండు సాంగ్స్ ను కాపీ చేసి దేవర ఫియర్ సాంగ్ కొట్టడా..?

ఈ సాంగ్ లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఎలివేట్ అయినప్పటికీ ఈ సాంగ్ స్టార్టింగ్ లో విక్రమ్ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది.

Written By: Gopi, Updated On : May 20, 2024 11:54 am

Did Anirudh copy these two songs and hit Devara fear song

Follow us on

Devara Fear Song: జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇంకా ఆ అంచనాలకు తగ్గట్టుగానే నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫియర్ అనే సాంగ్ ని ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఎలివేట్ అయినప్పటికీ ఈ సాంగ్ స్టార్టింగ్ లో విక్రమ్ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది.

అలాగే ఫస్ట్ చరణంలో జైలర్ లోని హుకుం సాంగ్ లోని కొన్ని బీట్స్ ని అయితే కాపీ చేసి ఈ సాంగ్ లో ఆడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి హుకుం సాంగ్ అలాగే విక్రమ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని కలిపి కొడితే వచ్చిందే ఈ దేవర ‘ఫియర్ సాంగ్’ అనేది సాంగ్ వింటున్న కొద్ది మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ సాంగ్ బాగున్నప్పటికీ అనిరుధ్ కాపీ మ్యూజిక్ ని ఇచ్చాడని కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా విక్రమ్ మ్యూజిక్ అలాగే జైలర్ సినిమాలోని హుకుం సాంగ్ ను బీట్ చేసే విధంగా ఈ సాంగ్ ఉంటుందని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు.

అయితే ఈ రెండు సాంగులను కలిపే ఈ మ్యూజిక్ ని కొట్టాడనే విషయం చాలామందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే ఈ రెండు సినిమాలను పోలుస్తూ ఈ సాంగ్ అంతకంటే బాగుంటుందని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగా అర్థమవుతుంది… ప్రస్తుతం అనిరుధ్ ఇండియా లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.

ఇక మొత్తానికైతే ఈ సాంగ్ తో దేవర సినిమా మీద ఒక్కసారిగా అంచనాలైతే తారా స్థాయికి చేరుకున్నాయి. కానీ అనిరుధ్ మిగిలిన సినిమాలకు ఇచ్చినంత ఎఫెక్టివ్ గా ఈ సాంగ్ లో అయితే మ్యూజిక్ లేదనిపిస్తుంది. చూడాలి మరి మిగతా సాంగ్ ల విషయం లో ఎలాంటి మ్యూజిక్ ను ఇస్తాడు అనేది….