Odisha: ఇటీవల హైదరాబాద్ మహానగరంలో కూకట్ పల్లి ప్రాంతంలో ఓ బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. దీంతో ఈ కేసును మూసివేయాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఒక్క చిన్న ఆధారం ఈ కేసు గతిని మలుపు తిప్పింది. అంతేకాదు నిందితుడిని పట్టించింది.. ఈ కేసు మాత్రమే కాదు.. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో కూడా ఇలాంటి మలుపే చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులకు పట్టించింది.
మామూలుగా అయితే ఒక వ్యక్తి చనిపోతే అతడికి సంబంధించిన వస్తువులను మొత్తం వాడుకలో నుంచి తొలగిస్తారు. ఇప్పటి కాలంలో అయితే ఆ వ్యక్తి ఉపయోగించిన సిమ్ కార్డ్ డియాక్టివేట్ చేయిస్తారు. లేదా ఆ సిమ్ తొలగించి.. అతను ఉపయోగించిన ఫోన్లో మరో సిమ్ కార్డు వేస్తారు. కానీ ఈ సంఘటనలో మాత్రం ఆ యువకుడు దారుణమైన పనిచేశాడు. ఎవరూ ఊహించని విధంగా తన ప్రేయసి చనిపోయినప్పటికీ.. ఆమె ఫోన్ ఉపయోగించాడు. దాదాపు ఆమె చనిపోయిన ఎనిమిది నెలల తర్వాత అతడు పోలీసులకు చిక్కాడు.
ఎంత వెతికినప్పటికీ..
అది ఒడిశా రాష్ట్రం. భువనేశ్వర్ ప్రాంతం లో నిరూపమ అనే యువతి నివసిస్తూ ఉండేది. ఆమె వయసు 27 సంవత్సరాలు. ఓ ఇంట్లో సంరక్షకురాలిగా పనిచేస్తూ ఉండేది. ఆ యువతి అందరితోనూ కలివిడిగా ఉండేది. చలాకీగా మాటలు కలుపుతూ ఉండేది. అలాంటి ఆ యువతి జనవరి 24న తన తండ్రితో మాట్లాడింది. సోదరుడితో కూడా మాట్లాడండి. ఇంకా అప్పటినుంచి ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం రణపూర్ వెళ్తున్నట్టు పేర్కొంది. పోలీసులు ఎంక్వయిరీ చేస్తే అక్కడ కూడా ఆమె కనిపించలేదు. పోలీసులు ప్రయత్నించిన ప్రతి సందర్భంలో కొన్నిసార్లు ఆమె ఫోన్ ఆన్ అయింది. మరి కొన్నిసార్లు ఆఫ్ అయ్యేది. జనవరి 24 నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు రోజుల తర్వాత అంటే జనవరి 27న భరత్ పూర్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎంత వెతికినా సరే ఆమె ఆచూకీ లభించలేదు.
అనుమానం పెంచుకొని..
నిరూపమ ఉపయోగించే ఫోన్, ఏటీఎం వంటివి ఇతరులు వాడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుమానితులపై ఒక కన్ను వేశారు. వారిపై నిఘా పెడుతూ పర్యవేక్షణ కొనసాగించారు. వారు సాగిస్తున్న విచారణ ఎట్టకేలకు ముగిసింది. ఆ యువతి ఫోన్.. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను దెబాషిష్ అనే యువకుడు వాడుతున్నట్టు తెలిసింది. అతడు నిరుపమకు స్నేహితుడిగా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.. నిరూపమతో అతడికి చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. ఇటీవల కాలంలో ఆమె ఎవరితోనో సన్నిహితంగా ఉంటుందని అతనికి అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే ఆమెను నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు భౌతికంగా దాడి కూడా చేశాడు.
ఫోన్ చేసి పిలిపించుకున్నాడు..
ఈ ఏడాది జనవరి 24న ఆమెకు ఫోన్ చేసి తపాంగ్ ప్రాంతంలో ఉన్న వారి వద్దకు రప్పించుకున్నాడు. ఆమెతో ఇదే విషయంపై వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత గొంతు నులిమి అత్యంత దారుణంగా హతం చేశాడు. నిరూపమ మృతదేహాన్ని క్వారీ దగ్గర ఉన్న పెద్ద గుంతలో పడేశాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్, ఏటీఎం కార్డు తీసుకొని ఉపయోగిస్తున్నాడు. నిరూపమా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆమె ఫోన్ నెంబర్.. ఏటీఎం నిందితుడు వాడుతున్న నేపథ్యంలో.. సిగ్నల్ సాధారణంగా దొరికిపోయాడు.. అయితే అప్పటికే నిరూపమ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. నిందితుడి దగ్గర మృతురాలి వస్తువులు లభించాయి.