Kurnool Fraud: ఇది మామూలు మోసం కాదు. మాటలకందని దారుణం. ఊహల కందని పన్నాగం. తీయగా మాటలు మాట్లాడారు. అందంతో సమ్మోహితులను చేశారు. కైపు కలిగించే చేష్టలకు పాల్పడ్డారు. చిత్ర విచిత్రమైన భంగిమలలో ఫొటోలు పంపించారు. తేనె పూసిన కత్తిలాగా వలపు వల విసిరారు. అక్కడితోనే ఆగలేదు వారి అసలైన ప్రణాళికను అమలు చేశారు. ఏకంగా 3.8 కోట్లు వసూలు చేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు కథ బయటపడింది.
Also Read: కిలాడి లేడి.. బడా బాబులే టార్గెట్.. రెండేళ్లలో 600 కోట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూల్ నగరంలో ఓ వ్యాపారిని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన మల్లేష్, అతని భార్య మేరీ, స్నేహితురాలు లిల్లీ మోసం చేశారు. ఏకంగా 3.8 కోట్లు వసూలు చేశారు. బాధితుడు పోలీసులకు ఈ విషయాన్ని చెప్పడంతో వీరి ముగ్గురి కథ బయటపడింది. దీనికోసం వారు రచించిన ప్రణాళిక.. చేసిన మోసం.. పోలీసులనే నివ్వెర పరిచింది. లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూశాయి.
కర్నూలు జిల్లా చెందిన ఆ వ్యాపారికి కొందరు నగ్న వీడియోలు పంపించారు. కైపు కలిగించే ఫోటోలు పంపించారు. అందానికి అందం.. శరీర సౌష్టవానికి సౌష్టవం కలిగిన అమ్మాయిల ఫోటోలను పంపించడంతో ఆ వ్యాపారి ఒక్కసారిగా అవాక్కయాడు. అంతేకాదు అదే వ్యాపారికి ఓ మహిళతో వాట్సప్ వీడియో కాల్స్ చేయించారు. తక్కువ ధరకు ప్లాట్లు అమ్ముతామని నమ్మ బలికించారు. అంతేకాదు అదే మహిళతో తరచూ వాట్సాప్ వీడియో కాల్ చేయించారు. కొన్ని సందర్భాల్లో నగ్నంగా వీడియో కాల్స్ చేయించి రెచ్చగొట్టారు. వాటన్నింటినీ రికార్డ్ చేయించి బెదిరించడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులకు ఈ వీడియోలను ఇస్తామని.. సామాజిక మాధ్యమాలలో పెడతామని ఇబ్బంది పెట్టారు. విడతలవారీగా 3.8 కోట్లు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఆ వ్యాపారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు రంగంలోకి దిగారు. వీడియో కాల్ చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా లిల్లీ, మేరీ, మల్లేష్ ను అరెస్ట్ చేశారు. ట్విట్టర్లో వీరు సంయుక్త రెడ్డి పేరుతో ఒక ఖాతా ఓపెన్ చేయడం విశేషం. దాని ద్వారానే ఆ వ్యాపారికి వలపు వల విసిరారు.