https://oktelugu.com/

New Year, Omicron: న్యూఇయర్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆంక్షల మధ్యే సెలబ్రెషన్స్..!

New Year, Omicron: కొత్త ఆశలతో.. కొంగొత్త ఆలోచనలతో ఎంతో ఉల్లాసంగా జరుపుకునే కొత్త సంత్సరం వేడుకలు ఈసారి కూడా ఆంక్షల మధ్య జరుపుకునే పరిస్థితి ఏర్పడనుంది. కొన్ని రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకలను ఇప్పటికే రద్దు చేశాయి. కానీ తెలంగాణలో నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించింది. కానీ ఏపీ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మిగతా రాష్ట్రాలు అలర్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆదాయానికి దెబ్బపడే అవకాశం ఉన్నందున […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2021 / 11:29 AM IST
    Follow us on

    New Year, Omicron: కొత్త ఆశలతో.. కొంగొత్త ఆలోచనలతో ఎంతో ఉల్లాసంగా జరుపుకునే కొత్త సంత్సరం వేడుకలు ఈసారి కూడా ఆంక్షల మధ్య జరుపుకునే పరిస్థితి ఏర్పడనుంది. కొన్ని రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకలను ఇప్పటికే రద్దు చేశాయి. కానీ తెలంగాణలో నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించింది. కానీ ఏపీ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మిగతా రాష్ట్రాలు అలర్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆదాయానికి దెబ్బపడే అవకాశం ఉన్నందున కొద్దిపాటి ఆంక్షలను విధించిందని అంటున్నారు.

    New Year, Omicron:

    దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగతున్నాయి. అందులో 10 శాతం ఒమిక్రాన్ కేసులే ఉంటున్నారు. మంగళవారం భారత్ లో కొత్తగా 6,358 కరోనా కేసులు నమోదవగా అందులో 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారిన పడ్డవారిలో 186 మంది కోలుకున్నారు. కరోనా కేసుల పెరుగుదలలో మహారాష్ట్ర మొదటి ప్లేసులో ఉంది. ఆ తరువాత ఢిల్లీ, కేరళ ఉన్నాయి. తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో టాప్ 3 దేశాల్లో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు న్యూఇయర్ వేడుకలు రద్దు చేశారు.

    Also Read: ముసురుకుంటున్న కరోనా..ఢిల్లీ, ముంబైలో తీవ్రత 70శాతం వరకూ..

    తెలంగాణలో మాత్రం భౌతిక దూరం పాటిస్తూ వేడుకలకు అనుమతినిచ్చింది. అయితే కరోనా రెండో వేవ్ లో ఇదే పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలో విజృంభించిన తరువాత తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా..? అనే ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 55 నమోదయ్యాయి. అయతే తెలంగాణలో నమోదైనవన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికే.అయినా కొన్ని ప్రాంతాలను కంటోన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించారు.

    సౌతాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ వివిధ దేశాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. యూకేలో రోజులకు లక్షకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే ఉంటున్నాయి. డెన్మార్క్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ సహా యూరప్ దేశాలన్నీ కొత్త వేరియంట్ బారిన పడ్డాయి. డెల్టా వేరియంట్ పూర్తిగా తొలిగిపోకముందే ఒమిక్రాన్ ముంపు రావడంతో తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మనదేశంలో సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు ఇప్పుడున్న పరిస్థితి ఉండేది. మొదట్లో కేసులు మెల్లగా నమోదై.. ఆ తరువాత విజృంభించాయి. అయితే ఆ సమయంలో పూర్తిగా అంచనా వేయలేకపోయారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అప్రమత్తమై తగిన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే ఆ సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం కేసుల పెరుగుదలకు కారణమైంది. ఇప్పుుడు కూడా జాగ్రత్తలు పాటించేందుకే ప్రభుత్వాలు ఆంక్షలు పెడుతున్నాయి.

    Also Read:  ‘అటు ప్రభాస్ – ఇటు మెగాస్టార్ ‘ ఇద్దరిదీ ఒకే ప్లానింగ్ !