https://oktelugu.com/

కరోనాను కట్టడి చేసిన దేశంగా నార్త్ కొరియా.. ఎలా సాధ్యమైందంటే..?

  కరోనా వైరస్ రాకతో మనుషుల జీవితాలలో అనుకోని కష్టాలు మొదలయ్యాయి. సాఫీగా జీవనం సాగిస్తున్న వారికి ఈ వైరస్ కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడాల్లేకుండా అన్ని చోట్లా వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మాహమ్మారి బారిన పడ్డాయి. అయితే నార్త్ కొరియాలో మాత్రం ఇప్పటివరకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 11, 2020 10:28 am
    Follow us on

     

    కరోనా వైరస్ రాకతో మనుషుల జీవితాలలో అనుకోని కష్టాలు మొదలయ్యాయి. సాఫీగా జీవనం సాగిస్తున్న వారికి ఈ వైరస్ కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడాల్లేకుండా అన్ని చోట్లా వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

    ప్రపంచ దేశాలన్నీ కరోనా మాహమ్మారి బారిన పడ్డాయి. అయితే నార్త్ కొరియాలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. చైనాలోని వుహాన్ నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వైరస్ ప్రభావం నార్త్ కొరియాపై మాత్రం పడకపోవటం గమనార్హం. పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75 వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ కరోనా గురించి వ్యాఖ్యలు చేశారు.

    దేశంలో ఒక్క కరోనా కేసు కూడా గొప్ప విషయమని అన్నారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని తెలిసిన వెంటెనే సరిహద్దులను మూసివేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని వెల్లడించారు. అయితే కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ఉత్తర కొరియాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించాయని వార్తలు వచ్చాయి. ఆ వ్యక్తికి కరోనా సోకిందో లేదో తెలియాల్సి ఉంది.

    కిమ్ జంగ్ దేశ ప్రజలంతా కరోనా వైరస్ నిబంధనలను తప్పక పాటించాలని సూచనలు చేశారు. ప్రపంచ దేశాలన్నీ వైరస్ ధాటికి గజగజా వణుకుతుంటే నార్త్ కొరియా మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని దేశంగా ప్రత్యేకతను సొంతం చేసుకోవడం గమనార్హం.