
కరోనా వ్యాక్సిన్ వస్తోందంటూ ప్రచారం జరుగుతుండడంతో ప్రజల్లో సంతోషం కనిపిస్తోంది. ఇటీవల ఫైజర్ కంపెనీ తమ టీకా 90 శాతం ఫలితాలిస్తోందని ప్రకటించింది. తర్వాత రష్యా తమ స్కోర్ 92 శాతం సమర్థత అని చెప్పుకుంది. ఇంకా చాలా ఫార్మా కంపెనీలు తమ టీకాను తుది దశ పరీక్షలకు పంపాయి. ఆ రిజల్ట్స్ రావాల్సి ఉంది. దీంతో ఎలాగైనా టీకా వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో దేశాలు టీకా పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
Also Read: ట్రంప్ కు వెన్నుపోటు: వాషింగ్టన్ రక్తసిక్తం.. మారణాయుధాలతో స్వైరవిహారం
భారత్ లాంటి దేశాల్లో కోట్లకు కోట్ల డోసులు రెడీగా ఉన్నాయని ప్రాధాన్యతలు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సమాచారం కూడా పంపారు. అయితే.. టీకా పూర్తి అందుబాటులోకి వచ్చే సరికి దాని అవసరం లేని వాళ్లే ఎక్కువగా ఉంటారని తాజాగా నిపుణులు చెబుతున్నారు. సీరో సర్వైలెన్స్ సర్వే ద్వారా అసలు కరోనా ఎంత మందికి సోకిందన్న విషయంపై పరిశోధన చేస్తున్నారు.
చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సగం మందికిపైగా కరోనా సోకి తగ్గిపోయిందని.. వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ప్రకటించారు. అది ఇంకా పెరుగుతోంది. కొన్నాళ్ల తర్వాత 70, 80 శాతానికి చేరుతుంది. కొంత మందికి కరోనా సోకకుండానే యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతున్నాయని గుర్తించారు. అంటే.. ఓ రకంగా ఇమ్యూనిటీ పవర్ సాధించినట్లే అవుతుంది.
Also Read: చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్
అయితే.. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే జనాభాలో 60 శాతం మందికి వైరస్ వచ్చి ఉండాలి. మన జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చింది. అందుకే.. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ దగ్గరకు ఇండియా వచ్చిందని.. తర్వాత టీకా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Comments are closed.