
హైదరాబాద్ ఇందిరా పార్కులో నిర్మించిన పంచతత్వ పార్కును రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఎకరం విస్తీర్ణంలో ఎనిమిది బ్లాకుల్లో అక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్ ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో దీనిని నిర్మించారు. దీనిపై నడుస్తున్నప్పడు పాదాల అడుగుభాగంలో ఉన్న నరాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ట్రాక్ చుట్టూ వివిధ రకాల ఔషధ మొక్కలను నాటారు. ఇప్పడున్న అనారోగ్య పరిస్థతుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు.