https://oktelugu.com/

ప్రైవేట్‌ మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్.. ఎప్పటినుంచంటే..?

దేశంలో కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రకియ మొదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్లు, ప్రైవేట్ రంగ వైద్య సిబ్బందికి మొదట వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉండటం, వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లు పలు రాష్ట్రాల్లో మృతి చెందినట్టు వార్తలు రావడంతో కొంతమంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. Also Read: ప్రజలకు మరో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 04:37 PM IST
    Follow us on

    దేశంలో కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రకియ మొదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్లు, ప్రైవేట్ రంగ వైద్య సిబ్బందికి మొదట వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉండటం, వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లు పలు రాష్ట్రాల్లో మృతి చెందినట్టు వార్తలు రావడంతో కొంతమంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.

    Also Read: ప్రజలకు మరో షాక్.. కరోనా కంటే ప్రమాదకరమైన ఫంగస్..?

    కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండటంతో మోదీ సర్కార్ ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో వ్యాక్సిన్ ను ప్రైవేట్‌ మార్కెట్‌ లో అనుమతించడానికి సిద్ధమవుతోంది. ప్రైవేట్ మార్కెట్ లోకి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసి వ్యాక్సిన్ ను వేయించుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్లు వేయించుకోవచ్చు. డీసీజీఐ చెబుతున్న వివరాల ప్రకారం కరోనా వ్యాక్సిన్ ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది.

    Also Read: ఆత్మనిర్భర్.. భారత్ సాధించిన ఘనత ఇదీ

    దేశంలోని చాలామంది ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి అనేక సందేహాలు, అపోహలు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపడుతూ ఉండటం గమనార్హం. కరోనా వైరస్ ఉధృతి తగ్గడం కూడా హెల్త్ వర్కర్లతో పాటు ప్రజల్లో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సుముఖత చూపకపోవడానికి కారణమని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

    డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కోవాగ్జిన్, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది.