https://oktelugu.com/

తొలివిడత ఫలితాలు.. ఎవరిగోల వారిది..

ఏపీలో తొలివిడత పంచాయతీ పోరు ముగిసింది. మాటలు యుద్దాలు.. అధికారుల బదిలీలు.. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధానికి తొలివిడత అనంతరం కాస్త విరామం దొరికింది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావంటే .. మావని.. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీలు ప్రకటించేసుకుంటున్నాయి.తొలి విడత జరిగిన ఎన్నికల్లో సానుభూతి పరులు 2300కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారని వైసీపీ ప్రకటించింది. Also Read: ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు..? మొత్తంగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 10, 2021 / 03:07 PM IST
    Follow us on


    ఏపీలో తొలివిడత పంచాయతీ పోరు ముగిసింది. మాటలు యుద్దాలు.. అధికారుల బదిలీలు.. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధానికి తొలివిడత అనంతరం కాస్త విరామం దొరికింది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావంటే .. మావని.. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీలు ప్రకటించేసుకుంటున్నాయి.తొలి విడత జరిగిన ఎన్నికల్లో సానుభూతి పరులు 2300కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారని వైసీపీ ప్రకటించింది.

    Also Read: ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు..?

    మొత్తంగా ఎనబై నాలుగుశాతం పంచాయతీలు తమ పార్టీ అభిమానుల చేతుల్లో ఉన్నాయని చెబుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలు కాకుండా.. వైసీపీ కన్నా ఎక్కువ స్థానాలు వచ్చాయని క్లయిమ్ చేసుకుంటోంది. తొలి విడతలో వైసీపీ కి 500 వరకు ఏకగ్రీవాలు వచ్చాయి. అవి కాకుండా 2700కు పైగా పంచాయతీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే.. తమకు పదకొండు వందలకు పైగా వచ్చాయని మరికొన్ని ఫలితాలు కావాలనే నిలిపివేశారని అంటోంది.

    వాస్తవంగా పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. పార్టీ సానుభూతి పరులే కానీ సొంతంగా పోటీలో దిగుతారు. అందరూ స్వతంత్రులుగానే భావిస్తారు. కానీ పార్టీ క్యాడర్ గ్రామాల వారీగా చీలిపోయి ఉంటుంది కాబట్టి ఆ దిశగా గెలిచిన వాటిని రెండు పార్టీలు తమపార్టీ అంటే.. తమ పార్టీ క్లయిమ్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే సాధారణంగా స్థానికసంస్థల ఎన్నికల్లో అధికార పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపుతుంటారు. ఎవరుకూడా ప్రభుత్వంతో విరోదం పెంచుకోవాలని చూడరు. ఆ ట్రెండే ఇప్పడు కనిపిస్తోందని వైపీసీ నేతలు అంటున్నారు.

    Also Read: డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..

    అన్ని జిల్లాలలోనూ తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగానే సర్పంచ్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థులు బలంగా నిలబడే ప్రయత్నం చేశారు. అయితే సహజంగానే అధికార పార్టీకి ఉండే మొగ్గు తొలిపంచాయతీ ఎన్నికల సందర్భంగా కనిపించింది. అయితే ఎక్కడ కూడా ఏకపక్ష ఎన్నికలు జరగలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్నో ఒత్తిళ్లు పెట్టిందని.. పోటీలు కూడా లేకుండా కేసులు పెట్టే.. ప్రయత్నం చేసిందని.. అయినా.. అన్నింటికి తట్టుకుని నిలబడ్డామని ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్