Corona Cases In India: దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు మూడు దశల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన మహమ్మారి మరోమారు తన పంజా చూపిస్తోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో నాలుగో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదివరకే దేశంలో నాలుగో దశ జూన్ లో ప్రారంభమవుతుందని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో నానా తంటాలు పడుతున్నారు.

ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజులుగా కేసులు తగ్గినా ప్రస్తుత మాత్రం భయానక స్థాయిలో పెరుగుతుండటం అందరని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో వైరస్ మహమ్మారి తన ప్రతాపం చూపించడంతో కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 17 వేలకు పైగా దాటుతుండటం గమనార్హం. మునుపటి పరిస్థితులు వస్తాయేమోననే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి కరోనా మహమ్మారి తన పడగ విప్పుతోంది.
Also Read: Venkatesh- Balakrishna: బాలయ్యతో వెంకటేష్ కామెడీ.. ఫన్ లవర్స్ కి ఫుల్ కిక్కే
దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు కోట్లకు పైగా దాటాయి. ఇందులో మరణాల సంఖ్య ఐదు లక్షలకు పైగానే ఉంది. కరోనాతో కోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నా వైరస్ ధాటికి అందరు కుదేలైపోతున్నారు. ఒక వైపు టీకాలు వేస్తున్నా వైరస్ మాత్రం తన ప్రతాపం పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన రేపుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

నాలుగో దశ ముప్పుతోనే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో మూడు దశల్లో ప్రజలను ఎంతో వ్యయప్రయాసలకు గురి చేసిన వైరస్ మరోమారు తన ప్రభావంతో ప్రజలను అల్లకల్లోలం చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతో ఏం చేయాలో తోచడం లేదు. ఇదివరకు పాటించిన భౌతిక దూరం, మాస్కులు ధరించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరోమారు హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దేశంలో వైరస్ ప్రజలను మరోసారి నిబంధనలు పాటించేలా చేస్తోందనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read: Atmakur By Poll Results: ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం.. మెజార్టీ ఎంతో తెలుసా?
[…] Also Read: Corona Merger In India: భారత్ లో కరోనా విలయం.. గడిచిన … […]
[…] Also Read: Corona Merger In India: భారత్ లో కరోనా విలయం.. గడిచిన … […]