China Shenzhen Lock Down: కరోనా పుట్టిళ్లు అయిన చైనాలో వైరస్ మరోమారు విజృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో మళ్లీ చలనం వస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా హ్యీపీగా ఉన్నా ఇప్పుడు మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ చైనాలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2020 మార్చి తరువాత రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు వెలుగు చూడటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

సోమవారం 2300 కేసులు నమోదు కావడంతో చైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆంక్షలు విధిస్తూ లాక్ డౌన్ అమలు చేసేందుకు ఉపక్రమించింది. ఆదివారం 3400 కేసులు బయటపడటంతో దక్షిణ చైనాలోని షెన్ జెన్ సిటీలో వైరస్ తీవ్రత పెరుగుతోంది. దీంతో జనాభా ఎక్కువగా ఉన్న సిటీ కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. షెన్ జెన్ లో 1.75 కోట్ల జనాభా ఉన్నందున అధికారుల్లో ఆందోళన పట్టుకుంది.
Also Read: పవన్ టార్గెట్ ఫిక్స్.. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!
ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో వైరస్ ఉధృతిని తగ్గించేందుకు సిద్ధమవుతోంది. కరోనా ముప్పును అధిగమించేందుకు రెడీ అవుతోంది. కరోనాతో ప్రపంచమే భారీ మూల్యం చెల్లించుకున్న నేపథ్యంలో మళ్లీ అక్కడ విజృంభించడంతో అటు అధికారులు ఇటు ప్రజల్లో భయం వ్యక్తమవుతోంది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాం్ చున్, షాన్ డాంగ్, ప్రావిన్స్ లోని యుచెంగ్ లో లాక్ డౌన్ విధించింది.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వల్ల దాదాపు అన్ని దేశాలు బాధితులుగా మారిన సంగతి తెలిసిందే. టీకాలు వేసుకోవడంతో నియంత్రణలోకి వచ్చినా అక్కడ టీకాల ప్రభావం పని చేస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మన దేశంలోనైతే టీకాలు వేసుకోవడంతోనే వైరస్ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. కానీ చైనా మాత్రం వైరస్ దాడిని తట్టుకోలేకపోతోందా అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి.

దీంతో ప్రపంచమే భయాందోళన చెందుతోంది. మళ్లీ చైనా ఇలాంటి దురాగాతాలు చేస్తుంటే వైరస్ ప్రభావం ఇంకెంత నష్టం కలుగజేస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో కరోనాను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటారోననే విషయం ఎవరికి అర్థం కావడం లేదు.
Also Read: పవన్ ‘పవర్’ పాలిటిక్స్ చేస్తున్నారా?