Radhe Shyam Box Office Collection: ప్రభాస్ అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. ఒకప్పుడు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అయిన ప్రభాస్.. బాహుబలితో నేషనల్ హీరో అయిపోయాడు. దాంతో అతని మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. బడ్జెట్ వందల కోట్లు దాటేసింది. ఇప్పుడు రాధేశ్యామ్ ఎన్నో అంచనాల నడుమ, వందల కోట్ల బడ్జెట్ తో వచ్చింది. కానీ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

దాంతో ఆరు రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ సారి చూద్దాం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన రాధేశ్యామ్.. మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఐదు భాషల్లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఓ రేంజ్‌లో జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి 202.80 కోట్ల బిజినెస్ జరిగింది.
Also Read: జయలలిత, శోభన్ బాబు కూతురుని నేనే.. ఆధారాలు ఉన్నాయంటున్న మహిళ..
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.204కోట్లు నమోదైంది. కానీ ఆరోజు రోజుల్లో దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఆరు రోజుల్లో కలిపి రూ.78.40 కోట్లు షేర్ వచ్చింది. దాంతో పాటు రూ.140.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది రాధేశ్యామ్. ఆరో రోజు మాత్రం రూ.64లక్షల షేర్‌ను వసూలు చేయగా.. రూ.1.5కోట్ల గ్రాస్‌ను తెచ్చుకుంది.
అయితే రోజు రోజుకూ రాధేశ్యామ్ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. మొదటి నుంచి ప్లాప్ టాక్ కంటిన్యూ కావడంతో భారీ దెబ్బ పడిపోయింది. ఇంకో రూ.125.60 కోట్లు వస్తేనే రాధేశ్యామ్ హిట్ టాక్ కిందకు వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డార్లింగ్ ఇమేజ్‌ను ఇది భారీ దెబ్బ కొట్టేసింది.

దీనికంటే ముందు రిలీజ్ అయిన అఖండ, పుష్ప మూవీలు కలెక్షన్లతో దుమ్ము లేపాయి. ఈ రెండు సినిమాలు 11 రోజుల పాటు కోటి పైగా షేర్ వసూలు చేశాయి. అటు భీమ్లా నాయక్ కూడా ఆరు రోజుల వరకు రూ.కోటి వరకు షేర్‌ను వసూలు చేసింది. కానీ రాధే శ్యామ్ ఐదు రోజుల వరకే రూ.కోటి షేర్‌ను వసూలు చేసింది.
Also Read: ప్చ్.. పవన్ ‘భగత్ సింగ్’లో బూతు సిరీస్ నటుడు
[…] Relationship: అమ్మాయిలను ఆకర్షించాలని ఏ అబ్బయి అయినా కోరుకుంటాడు. అయితే అమ్మాయిలను పడేయాలంటే అంత ఈజీ కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని పనులు వదులుకుని అమ్మాయి వెంట పడితే.. చివరకు పడుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయితే అమ్మాయిలకు ఎలాంట అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటుంది, ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను వారు ఇష్టపడుతారు అనే విషయాలు తెలుసుకుంటే.. అమ్మాయిలను పడేయడం చాలా ఈజీ కదా. […]
[…] […]
[…] Rajamouli Interesting Comments On Ram Gopal Varma: నేషనల్ రేంజ్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే వారం ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ క్రమంలో రాజమౌళి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో రామ్ గోపాల్ వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి మాటల్లోనే.. ‘మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు చేయకూడదని.. ముఖ్యంగా ఎక్కువ రోజులు షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారమే.. ‘ఈగ’, ‘మర్యాద రామన్న’ సినిమాలు చేయడం జరిగింది. […]
[…] Radhe Shyam Collections: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వాస్తవిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఈ సినిమాని బతికించడానికి ప్రభాస్ ఫ్యాన్స్ తమ భుజానికెత్తుకున్నా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. మొత్తానికి ఈ లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు. […]