Homeఅప్పటి ముచ్చట్లుఆ కుర్రాడే ఆమెను సూపర్ స్టార్ ను చేశాడు !

ఆ కుర్రాడే ఆమెను సూపర్ స్టార్ ను చేశాడు !

Nayanatara
ఇప్పుడంటే ‘లేడీ సూపర్ స్టార్’ అంటూ ఆమెను కీర్తిస్తున్నాం, అలాగే గ్లామర్ ప్రపంచానికి ఆమె ఆదర్శం, ఆచరణీయం అంటూ స్తుతిస్తున్నాం గానీ, ఒకప్పుడు ఆమె లోకల్ ఛానల్ లో వార్తలు చదవడానికి కూడా పనికిరాదు అంటూ ఆమెను అవహేళన చేశారు, తీవ్రంగా ఆమెను అవమానించారు. ఇప్పుడొస్తోన్న కొత్త హీరోయిన్లు తమ అభిమాన నటీమణిగా ఆమెను ఆరాధిస్తున్నారు మంచిందే, నిజానికి ఆమె ఎదుగుదలను చూసి వాళ్ళు ప్రేరణ పొందాలి.

ఆమె నయనతార.. 1984 నవంబర్ 18న బెంగళూర్ లోని ఒక దిగువస్థాయి మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించింది. పుట్టినప్పుడు ఆమెకు పెట్టిన పేరు ‘డయానా మరియా కురియన్’. కేరళ రాష్ట్రంలో తిరువల్ల టౌన్ లోనే ఆమె చిన్న తనం గడిచింది. చిన్నప్పటి నుండి ఆమెకు తానూ అందంగా లేననే అసహనం ఎక్కువుగా ఉండేదట. సన్నగా నాజూగ్గా ఉండే అందమైన అమ్మాయిలను చూసినప్పుడు.. తానూ అలా ఉండి ఉంటే బాగుండేది అంటూ నయనతార కలలు కనేది అట. అలాంటి నయనతార హీరోయిన్ అవుతాను అని ఎలా అనుకుంటుంది. నిజానికి ఆమెకు అసలు నటన పై ఎక్కడా ఆసక్తి కూడా లేదట.

అయితే నయనతార డిగ్రీ మార్తోమా కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, ఆమె జీవితంలోకి ఒక కుర్రాడు వచ్చాడు, ఆమెను ప్రేమించాడు, ఆరాధించాడు కాకపోతే మరో అందమైన అమ్మాయి దొరికేవరకే అనుకోండి. అతను తనను వదిలివెళ్ళిపోయింది తానూ అందంగా లేననే అనుమానం నయనతారలో ఎక్కువైందట. దాంతో నలుగురిలో కలవడానికి కూడా ఆమె ఇబ్బంది పడేది. అది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తీసుకువెళ్లి.. తెలిసిన వాళ్ళ ఇంటిలో పెట్టారు. అక్కడ పరిచయమైన ఓ ఫ్రెండే నయనతారను పూర్తిగా మార్చేసింది.

ఆ సమయంలోనే తానూ ఎంతో గొప్ప అందగెత్తెను అనే భావన నయనతారలో రోజురోజుకూ ఎక్కువైందట. ఆ ఉత్సాహంలోనే తనని వదిలేసి వెళ్లిన కుర్రాడు తన అందాన్ని చూసి బాధ పడాలి అనే ఉద్దేశ్యంతో మోడలింగ్ చేసింది. చాలా లోకల్ బ్రాండ్స్ కు మోడలింగ్ చేసింది, ఒక లోకల్ ఛానల్ లో యాంకరింగ్ కూడా చేసింది. అప్పుడే ఎన్నో అవమానాలు పడింది. అయితే సినీ పరిశ్రమలో పెద్ద హీరోయిన్ అయిపోవాలని ఆమె ఎన్నడూ అనుకోలేదు. కానీ మలయాళం డైరెక్టర్ సత్యం అంతికాడ్ ‘మానసికారే’ అనే సినిమా తీయడానికి ప్లాన్ చేస్తూ వనిత మ్యాగజిన్ చూశాడు . అందులో మోడల్ గా ఉన్న నయనతారను చూసి ఛాన్స్ ఇచ్చాడు. అలా నటిగా సూపర్ స్టార్ గా మారిపోయింది నయనతార. ఐతే కెరీర్ మొదట్లో నయనతార ఆ కుర్రాడి మీద కోపంతోనే కసిగా పనిచేసేదట. ఒకవిధంగా ఆ కుర్రాడే ఆమెను సూపర్ స్టార్ ను చేశాడు అనుకోవాలేమో.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular