మెగాస్టార్.. తెలుగు సినీ తెర పై వెలిగి ఒదిగిన ధ్రువ తార. కోట్లాది అభిమానుల గుండెల్లో చిరంజీవిగా ఎన్నటికీ చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సినీ తార. అలాంటి మెగాస్టార్ సినీ జీవితం గురించి అందరికీ తెలుసు. మరి ఆయన పర్సనల్ విషయాలను తెలుసుకోవాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటాడు. అందుకు తగ్గట్లుగానే చిరుకి సంబంధించి.. అభిమానులకు, ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
వాటిల్లో ముఖ్యంగా చిరంజీవికి ఇష్టమైన హాబీ ఫొటోగ్రఫి. ఫోటోలు తీయడం అంటే చిన్నప్పటి చిరుకి చాలా ఇష్టం అట. ఒకరకంగా సినిమాల పై ఇష్టం పెరగడానికి ఫోటోలు తీయడం కూడా ఒక కారణం. అయితే, చిన్నప్పటి నుంచి తనకు ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టం ఉన్నా.. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోవాడనికి చాలా ఇబ్బంది పడతారట. అలాగే చిరు చిన్నతనం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిరంజీవి చేతి రాత అస్సలు బావుండదట.
ఎంత బావుండదంటే- చిరు రాసింది చిరుకే అర్ధం కాదట. అందుకే చిన్నతనంలో ఎప్పుడు సమయం దొరికినా చేతి రాతను మళ్లీ ప్రాక్టీసు చేస్తుండేవాడట. అలాగే చిరంజీవికి అబాకస్, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే చాలా ఇష్టం అట. ఇప్పుడు కూడా టైం దొరికితే.. అవి ఆడుతూ ఉంటారట. అవి ఆడటం ద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక చిరు తన జీవితంలో నమ్మి అనుసరించిన సిద్ధాంతం.. ఒక మార్గాన్ని ఎంచుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా, ఆ దారిలో వెళ్తే.. జీవితంలో అనుకున్నది సాధించొచ్చు అని చిరు బలంగా నమ్ముతారట. తన సినీ విజయానికి ప్రధాన కూడా అదేనని చిరు ఎప్పుడూ తన సన్నిహితుల దగ్గర చెబుతూ ఉంటారు. మెగాస్టార్ అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే.. తెలుగు సినిమా ఖ్యాతి పెంచిన ఘనత సాధించిన గ్రేట్ హీరో. తన మెగా జర్నీలో చిరంజీవి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న విజయాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.