‘బాహుబలి’తో రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్ కథలకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రాచుర్యం దక్కింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వచ్చిన ‘భజరంగీ భాయ్ జాన్’ మూవీ సైతం ఈస్టార్ రైటర్ స్టామినాను జాతీయ స్తాయిలో నిరూపించింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.

ప్రస్తుతం తన కుమారుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు కూడా విజయేంద్రప్రసాద్ యే కథా రచయిత. ఆ సినిమా అద్భుతంగా వచ్చేసిందని అంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ స్టార్ రైటర్ కు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి మరీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం కథను రెడీ చేయమన్నారట..
దీంతో తన అనుభవాన్ని అంతా రంగరించి విజయేంద్రప్రసాద్ జయలలిత జీవితంపై పరిశోధన చేసి మరీ ట్విస్టులు, ఉత్కంఠగా కథను మలిచి ఈ మూవీ తీస్తున్న డైరెక్టర్ విజయ్ చేతుల్లో పెట్టాడట..
ఆ మూవీ ఎట్టకేలకు పూర్తయ్యింది. జయలలిత బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించింది. ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళనాట ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. విజయేంద్రప్రసాద్ కథ, గమనం ఏదీ అని అందరూ ఆశ్చర్యపోయారట..
అయితే ఈ సినిమా చూసిన విజయేంద్రప్రసాద్ షాక్ అయ్యాడట.. ఆయన రాసిన సీన్లు చాలా మట్టుకు ఈ సినిమాలో లేవని.. దర్శకుడు విజయ్ మరికొంతమంది రైటర్లతో వేరే వెర్షన్లు రాయించుకున్నాడని తెలిసి విజయేంద్ర ప్రసాద్ అవాక్కైనట్టు తెలిసింది. సినిమా రిలీజ్ రోజే విజయ్ తోనూ, నిర్మాతలతోనూ విజయేంద్రప్రసాద్ అక్కసు వెళ్లగక్కినట్టు సమాచారం. కోటి రూపాయల పారితోషికం ఇచ్చి స్టార్ రైటర్ ను పెట్టుకొని మరీ ఆయన రాసిన సీన్లు పక్కనపెట్టి వేరే రాయించుకొని సినిమాను చెడగొట్టిన దర్శకుడు విజయ్ పై ఇప్పుడు అందరూ మండిపడుతున్న పరిస్థితి నెలకొంది.