Thaman Corona Negative: సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో సంచలనాత్మక సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కూడా కరోనా బారిన పడ్డాడు. అయితే, తాను కోవిడ్ -19 పాజిటివ్ నుంచి బయట పడ్డాను అంటూ తాజాగా థమన్ ట్వీట్ పెట్టాడు. ప్రస్తుతం థమన్ కరోనా నెగిటివ్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత వారం కోవిడ్ బారిన పడిన తమన్ కేవలం ఐదు రోజుల్లోనే కోవిడ్ ను జయించి ప్రస్తుతం తన పాటల లోకంలోకి వచ్చేశాడు.

అయితే, తనకు కోవిడ్ నెగిటివ్ వచ్చిన విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా థమన్ తెలియజేస్తూ.. ‘కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం నాకు నెగెటివ్ వచ్చింది. నేను కోలుకున్నాను. అయితే, నా కోసం ప్రార్థించిన వారందరికీ నా కృతజ్ఞతలు’ అంటూ థమన్ పోస్ట్ పెట్టాడు. ఏది ఏమైనా థమన్ కి కరోనా పాజిటివ్ అనగానే భారీ సినిమాల మేకర్స్ టెన్షన్ పడ్డారు.
కారణం.. థమన్ చేతిలో ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా ఉంది. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు. అలాగే ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాకి కూడా థమనే మ్యూజిక్ చేస్తున్నాడు. ఇక అన్నిటికీ మించి రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో మరో అతి పెద్ద పాన్ ఇండియా సినిమా కూడా థమన్ ఖాతాలోనే ఉంది.
Also Read: Thaman Corona Positive: థమన్ కి కరోనా పాజిటివ్.. ఇండస్ట్రీని కబళిస్తున్న కరోనా !
ఈ పాన్ ఇండియా సినిమాలతో పాటు శివ కార్తికేయన్ – ‘జాతిరత్నాలు’ అనుదీప్ కలయికలో రాబోతున్న సౌత్ సినిమా, ఇక బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న మరో సినిమా కూడా థమన్ ఖాతాలో ఉన్నాయి. అందుకే, థమన్ కోలుకోవడం ఆలస్యం అయి ఉంటే.. ఈ సినిమాల ప్లానింగ్ మొత్తం ఛేంజ్ అయిపోయేది. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
పైగా ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే వరుసగా కేసులు నమోదు అవ్వడం నిజంగా విచిత్రమే, గత రెండు కరోనా సీజన్స్ లో ఈ స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో కేసులు నమోదు కాలేదు. మూడో వేవ్ లో ఇలా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, కరోనా వైరస్ బారిన పడిన సెలబ్రిటీలు త్వరగా కోలుకుంటూ ఉండటం శుభపరిణామం.
OM NAMA SHIVAYA ♥️
God bless
Every One Take Good Care ❤️🩹 pic.twitter.com/iZ16n15NKo— thaman S (@MusicThaman) January 11, 2022
Also Read: మొన్న ఎన్టీఆర్, నిన్న బన్నీ, నేడు ప్రభాస్.. ఎవర్నీ వదట్లేదుగా !
[…] Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. ఇంట్లో సౌందర్య వాళ్ళు, కార్తీక్ వాళ్ళు లేకపోవటంతో ఆదిత్య ఒంటరి వాళ్ళం అయ్యాము అని బాధ పడతాడు. ఇక మోనిత ఎలాగైనా ప్రియమణిని వెతకాలని దారిన పోయే వాళ్ళను ప్రియమణి గురించి అడుగుతుంది. అంతలోనే అక్కడ్నుంచి దీప బాబుని తీసుకొని వస్తుంది. బాబు ఏడవటంతో పక్కకు వెళ్లి బాబు ని ఊరుకోపెడుతుంది. […]
[…] KTR: ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్ అసాధ్యమని రాజకీయ పరిశీలకులు చాలా సార్లు పేర్కొన్నారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టు వదలని విక్రమార్కుడి వలే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఈ ఫ్రంట్ ప్రస్తావన చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కొద్ది రోజుల పాటు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయమై కార్యచరణ స్టార్ట్ చేశారు. […]