https://oktelugu.com/

11Th అవర్ టీజర్ టాక్: చక్రవ్యూహంలో తమన్నా

స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా ఇప్పుడు ఓటీటీలకు డిమాండ్ ఏర్పడింది. అందులో రియాలిటీ వెబ్ సిరీస్ లు ఇప్పుడు జనాలను కట్టిపడేస్తున్నాయి. అందుకే చాలా మంది ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీసులల్లో నటిస్తుండడం విశేషం. కరోనా లాక్ డౌన్ వేళ మొదలైన ఓటీటీల సందడి కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తాజాగా తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో ‘11త్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2021 / 02:38 PM IST
    Follow us on

    స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా ఇప్పుడు ఓటీటీలకు డిమాండ్ ఏర్పడింది. అందులో రియాలిటీ వెబ్ సిరీస్ లు ఇప్పుడు జనాలను కట్టిపడేస్తున్నాయి. అందుకే చాలా మంది ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీసులల్లో నటిస్తుండడం విశేషం.

    కరోనా లాక్ డౌన్ వేళ మొదలైన ఓటీటీల సందడి కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తాజాగా తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో ‘11త్ అవర్’ అనే వెబ్ సిరీస్ చేసింది.

    జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ ను రూపొందించడం విశేషం. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో అనుకోని పరిస్థితుల్లో ఓ కార్పొరేట్ కంపెనీకి సీఈవో అయిన ‘అరాత్రికా రెడ్డి’ అనే అమ్మాయిగా తమన్నా నటించింది. ఆమెకు ఈ కంపెనీ నిర్వహించరాదని కుటుంబ సభ్యులు, శత్రువులు సైతం దెప్పిపొడుస్తున్నట్టు టీజర్ లో ఉంది.

    అయితే ఆ పోటీని తట్టుకొని శత్రువుల ఆటలను తమన్నా ఎలా కట్టిపెట్టిందన్నదే ఈ టీజర్ కథాంశం. ‘చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు. క్రియేట్ చేయాల్సి వస్తుంది’ అన్న డైలాగ్ ను బట్టి తమన్నా పోరాటం కార్పొరేట్ డ్రామా అని అర్థమవుతోంది.

    ప్రదీప్ ఉప్పలపాటి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ‘ఆహా’ ఓటీటీలో ఏప్రిల్ 9 నుంచి ప్రసారం కానుంది.