సుధీర్‌బాబు సాయం ‘సంస్కృతి’కి వరం !

‘హీరో సుధీర్‌బాబు ‘ పెద్ద మనసు చాటుకున్నారు. తన చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సుధీర్‌బాబు ఆపదలో ఉన్న చిన్నారికి అండగా నిలిచారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా సుధీర్‌ బాబు సేవా సమితి గౌరవాధ్యక్షుడు ఉంకిలి శ్రీనివాస్‌ చెప్పుకొచ్చాడు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.. లావేరు మండలం కేశవరాయుని పాలెం గ్రామానికి చెందిన డి.మోసె, లక్ష్మి దంపతుల కుమార్తె పేరు ‘సంస్కృతి జాస్మిన్‌’. అయితే సంస్కృతికు గుండె ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, పాప తల్లిదండ్రులు చాల […]

Written By: admin, Updated On : July 11, 2021 12:09 pm
Follow us on

‘హీరో సుధీర్‌బాబు ‘ పెద్ద మనసు చాటుకున్నారు. తన చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సుధీర్‌బాబు ఆపదలో ఉన్న చిన్నారికి అండగా నిలిచారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా సుధీర్‌ బాబు సేవా సమితి గౌరవాధ్యక్షుడు ఉంకిలి శ్రీనివాస్‌ చెప్పుకొచ్చాడు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.. లావేరు మండలం కేశవరాయుని పాలెం గ్రామానికి చెందిన డి.మోసె, లక్ష్మి దంపతుల కుమార్తె పేరు ‘సంస్కృతి జాస్మిన్‌’.

అయితే సంస్కృతికు గుండె ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, పాప తల్లిదండ్రులు చాల పేదవారు. పాపను బతికించుకోవడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సమకూరలేదు. దాంతో ఎవరో సహాయంతో సుధీర్ బాబును అప్రోచ్ అయ్యారు. వారి పాప దీనస్థితి తెలుసుకున్న సుధీర్ బాబు మే నెలలో రూ.1.70లక్షలు చెల్లించి ఆపరేషన్ చేయించారు.

అయితే తాజాగా ఆ చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరో రూ.1.50 లక్షలను శ్రీకాకుళంలోని హెడ్‌ పోస్టాఫీసులో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసి ఆ పాపకి భవిష్యత్తు పై భరోసా కల్పించారు. ‘పేద ప్రజలకు ఏదో రకంగా ఎవరొకరు నుండి సాయం అందుతుందని మా పాపకు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు, కానీ ఆ సమయంలో సుధీర్ బాబుగారు మా జీవితాలను నిబెట్టారని పాప తల్లిదండ్రులు ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు.

మొత్తానికి సుధీర్ బాబుకు సంస్కృతి గ్రామ ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ‘సుధీర్‌బాబు సాయం ‘సంస్కృతి’కి వరం అయిందని అంటున్నారు. ఏది ఏమైనా, సుధీర్ బాబు ఇలాంటి వారికి సాయం చేయడం మెచ్చుకోదగ్గ అంశం.