నేటి కామెడీ చిత్రాల దర్శక దిగ్గజం శ్రీనువైట్ల పరిస్థితి ప్రస్తుతం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలు పిలిచి మరీ శ్రీనువైట్లకు ఛాన్స్ లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు శ్రీనువైట్ల అడిగినా, చివరకు రిక్వెస్ట్ చేసినా ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వడానికి రెడీగా లేడు. మొత్తానికి శ్రీనువైట్ల కెరీర్ లోనే ఇది భారీ డౌన్ పీరియడ్.

అయితే హీరో ఎవరైనా తన సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ ను బాగా ఎలివేట్ చేసే ఈ సీనియర్ దర్శకుడి పై ఇంకా నమ్మకం ఉంచి, ప్రస్తుతం మంచు విష్ణు ఒక సినిమా చేస్తున్నాడు. ఎప్పటి నుండో కమర్షియల్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్న మంచు విష్ణుకు ప్రస్తుతం శ్రీనువైట్ల ఒక్కడే దొరికాడు.
అందుకే శ్రీను ప్లాప్స్ లో ఉన్నా ఆయనతో సినిమా చేస్తున్నాడు. అయితే, మంచు విష్ణు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న “డిడి (డబుల్ డోస్)” మూవీ అవుట్ ఫుట్ చాలా బాగా వస్తోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పైగా ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా నటిస్తున్నారు.
డబల్ డోస్ అంటే వినోదమే కాదు, గ్లామర్ డోస్ విషయంలోనూ సినిమా రెండింతలు ఉండేలా శ్రీనువైట్ల ప్లాన్ చేశాడట. ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ తాపత్రయ పడుతున్నాడు. అందుకే, ఒకపక్క ఈ సినిమా చేస్తూనే.. మరోపక్క మరో హీరో కోసం కూడా వెతుకుతున్నాడు.
అంటే.. ఈ సినిమా పూర్తి కాకముందే.. మరో సినిమాని మొదలుపెట్టాలనేదే శ్రీనువైట్ల ప్లాన్. ఈ క్రమంలో హీరో రామ్ తో శ్రీనువైట్ల ఒక సినిమా ప్లాన్ చేశాడు. రామ్ కూడా ఎప్పటి నుంచో శ్రీనువైట్లతో ఒక సినిమా చేయాలని ఆశ పడుతున్నాడు.
తాజాగా శ్రీనువైట్ల రామ్ కి ఒక కథ చెప్పాడు. కథ రామ్ కి బాగా నచ్చింది. మొత్తానికి వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి శ్రీను వైట్ల ఫామ్ లోకి రావడానికి నానాపాట్లు పడుతున్నాడు.