https://oktelugu.com/

రిపబ్లిక్ టీజర్ టాక్: వ్యవస్థ పునాదులు కదపలేరా?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ సారి సీరియస్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ‘ప్రస్థానం’ ఫేమ్ దేవాకట్టా కాంబినేషన్ లో ‘రిపబ్లిక్’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఎప్పుడూ లవర్ బాయ్, ఫ్యామిలీ డ్రామా చేసే సాయిధరమ్ తేజ్ ఈసారి సీరియస్ పాలిటిక్స్ పై ఈ సినిమా సంధిస్తున్నాడు. తాజాగా ‘రిపబ్లిక్’ టీజర్ ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ప్రజాస్వామ్యం గురించి.. నేతల చేతుల్లో బంధీలైన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 5, 2021 / 12:44 PM IST
    Follow us on

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ సారి సీరియస్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ‘ప్రస్థానం’ ఫేమ్ దేవాకట్టా కాంబినేషన్ లో ‘రిపబ్లిక్’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఎప్పుడూ లవర్ బాయ్, ఫ్యామిలీ డ్రామా చేసే సాయిధరమ్ తేజ్ ఈసారి సీరియస్ పాలిటిక్స్ పై ఈ సినిమా సంధిస్తున్నాడు.

    తాజాగా ‘రిపబ్లిక్’ టీజర్ ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ప్రజాస్వామ్యం గురించి.. నేతల చేతుల్లో బంధీలైన ప్రజలు, ఐఏఎస్, అధికారుల గురించి ఇందులో చూపించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

    ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాలను వేరు చేయలేం అన్న జార్జ్ అర్వెల్ కొటేషన్ ను గుర్తు చేస్తూ ట్రైలర్ పాలిటిక్స్ పై సంధించిన అస్త్రంగా ఉంది. వ్యవస్థ పునాదులు కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే అన్న డైలాగ్ ఆలోచింప చేసేలా ుంది.

    సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. రమ్యక్రిష్ణ రాజకీయ నేతగా కనిపిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.