Sathyaraj: ప్రముఖ నటుడు సత్యరాజ్ కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, తాజాగా ఆయన ఆరోగ్యం పై ఓ అప్ డేట్ తెలిసింది. సత్యరాజ్ ఆరోగ్యం విషమించిందని.. దాంతో వైద్య బృందం ఆయన పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామంటూ చెప్పింది. సత్యరాజ్ కి కరోనా ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉందట. ఇక సత్యరాజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: బాహుబలి కట్టప్ప ‘సత్యరాజ్’ ఆరోగ్యం విషమం.. త్రిషకి కరోనా !
‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్(Sathyaraj) అందరికి బాగా దగ్గర అయ్యాడు. దాంతో ‘బాహుబలి’ నటుడికి కరోనా అంటూ నేషనల్ రేంజ్ లో ఈ వార్త వైరల్ అవుతుంది. మొత్తమ్మీద ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో మొత్తానికి పరిస్థితి విషమించింది. దాంతో కరోనా భయం మళ్ళీ మొదలైంది.
నిజానికి మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అన్నట్టు ఈ రోజు కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన్ కూడా కరోనా బారిన పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తనకు కోవిడ్ సోకిందని ఆమె తాజాగా ట్వీట్ చేసింది. అలాగే హీరోయిన్ త్రిషకి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆమె వైరస్ నుంచి వేగంగా కోలుకుంటుంది. ఇప్పటికే సత్యరాజ్ అండ్ త్రిష మరియు శోభన కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా కరోనా వచ్చింది.
Also Read: సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ సమంత..!
[…] […]