https://oktelugu.com/

Samantha Akkineni : రెస్టారెంట్‌లో అక్కినేని కోడ‌లు ర‌చ్చ‌.. ప్రీత‌మ్‌, సింగ్ తో పార్టీ

పెళ్లైతే చాలా మంది కెమెరా నుంచి సైడైపోతారు. కానీ.. అక్కినేని కోడ‌లు స‌మంత (Samantha Akkineni) మాత్రం అదే జోరు కొన‌సాగిస్తోంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ కు సంబంధం లేదంటూ త‌న‌దైన దారిలో ముందుకు సాగుతోంది. ఇటీవ‌లే ఈ అమ్మ‌డు లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘శాకుంత‌లం’ షూట్ కంప్లీట్ అయ్యింది. మహాభారత ఆదిపర్వంలోని స్వచ్ఛమైన ప్రేమకథను అందించబోతున్నారు దర్శకుడు గుణశేఖర్. దుష్యంతుడు – శకుంతల మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో పౌరాణికంపై ప‌ట్టున్న […]

Written By:
  • Rocky
  • , Updated On : August 18, 2021 / 03:49 PM IST
    Follow us on

    పెళ్లైతే చాలా మంది కెమెరా నుంచి సైడైపోతారు. కానీ.. అక్కినేని కోడ‌లు స‌మంత (Samantha Akkineni) మాత్రం అదే జోరు కొన‌సాగిస్తోంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ కు సంబంధం లేదంటూ త‌న‌దైన దారిలో ముందుకు సాగుతోంది. ఇటీవ‌లే ఈ అమ్మ‌డు లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘శాకుంత‌లం’ షూట్ కంప్లీట్ అయ్యింది. మహాభారత ఆదిపర్వంలోని స్వచ్ఛమైన ప్రేమకథను అందించబోతున్నారు దర్శకుడు గుణశేఖర్. దుష్యంతుడు – శకుంతల మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో పౌరాణికంపై ప‌ట్టున్న ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిందే. మ‌రి, అలాంటి కావ్యాన్ని గుణ‌శేఖ‌ర్ సెల్యూలాయిడ్ పై ఏవిధంగా చెక్కార‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

    ఈ చిత్రం త‌ర్వాత విఘ్నేశ్ శివ‌న్‌మూవీ ఒక‌టి బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాల‌తో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార వంటి స్టార్ల‌తో న‌టిస్తోంది సామ్‌. త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ఈ మూవీ రాబోతోంది. ఈ రెండు చిత్రాల సంగ‌తి ఇలా ఉంచితే.. ఆ మ‌ధ్య‌ విడుద‌లైన ఫ్యామిలీ మేన్-2 చిత్రంతో త‌న పెర్ఫామెన్స్ మొత్తం బ‌య‌ట‌కు తీసి ఔరా అనిపించింది స‌మంత‌. ఆ సిరీస్ స‌క్సెస్ లో స‌మంత పోషించిన కీ రోల్ అంద‌రినీ అబ్బుర ప‌రిచింది. డీ-గ్లామ‌ర‌స్ రోల్ లో స‌మంత అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించింది.

    ఈ విధంగా.. పెళ్లి త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ కొన‌సాగిస్తూ.. సూప‌ర్ హిట్లు సొంతం చేసుకుంటూ కెరీర్ ను లీడ్ చేస్తోంది స‌మంత‌. అయితే.. ఇప్పుడు ప్రాజెక్టులు పెద్ద‌గా చేతిలో లేవో.. ఫ్రీ టైమ్ బాగా దొరికిందోగానీ.. హాలీ డేస్ ఎంజాయ్ చేస్తోందీ బ్యూటీ.

    తాజాగా.. త‌న ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కు వెళ్లి ఎంజాయ్ చేసింది. మేక‌ప్ ఆర్టిస్ట్ సాధ‌న సింగ్‌, డిజైన‌ర్ ప్రీత‌మ్ తో క‌లిసి లంచ్ కోసం బ‌య‌ట రెస్టారెంట్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటీ.. ఏం తిన్నారో కూడా చెప్పారు. మొత‌త్ంగా వేగ‌న్ ఫుడ్ లాంగిచేసిన‌ట్టు రాసుకొచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఆడియ‌న్స్‌.. ‘ఎంజాయ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.