‘రాధికా ఆప్టే’ అంటే హాట్ సమాజంలో ఆమె సృష్టించిన ప్రకంపనలే కాదు, నటనా ప్రపంచంలో ఆమె చూపిన నటనా వైవిధ్యం కూడా గుర్తుకు వస్తుంది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం రాధికా ఆప్టేకి అంత సులభంగా ఏమి జరగలేదు. పాత్ర కోసం ఎక్కడా రాజీ పడకుండా ఘోరమైన సాహసాన్ని కూడా చేసింది, తీవ్రమైన విమర్శలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నా.. పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ సీన్స్ లో కూడా నటించింది.
తెగింపుకి మారుపేరుగా నిలిచిన రాధికా ఓ సినిమా కోసం చేసిన ఓ సాహసం కారణంగా నాలుగు రోజులు పాటు ఇంటికే పరిమితం అయిపోయి కుమిలిపోయింది, ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే చెబుతూ.. ‘నేను సాధారణ నటిగా మిగిలిపోకుండా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని నేను ఎంతో సాహసం చేసాను. ముఖ్యంగా 2015లో నేను నటించిన ‘పార్చ్‌డ్’ వల్ల చాల విమర్శలతో పాటు ఇబ్బందులు కూడా పడ్డాను. ‘పార్చ్‌డ్’లో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నేను నటిస్తేనే నా పాత్రకు న్యాయం జరుగుతుంది.
అందుకే అలాంటి బోల్డ్ సీన్స్ లో కనిపించాను. అయితే, ఆ సినిమాని రిలీజ్ కి ముందే టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ షో వేశారు. దాంతో నేను నటించిన అశ్లీల సన్నివేశాలు ఆన్ లైన్ లో లీక్ అయి వైరల్ అయ్యాయి. ఆ సమయంలో నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుతూ నా పై ఎన్నో విమర్శలు చేశారు. చివరకు నా డ్రైవర్, వాచ్‌మెన్, అలాగే నా స్టైలిష్ట్ డ్రైవర్ కూడా ఆ సీన్స్ లో నన్ను గుర్తుపట్టి, నా వైపు వాళ్ళు హేళనగా చూస్తోన్న ఫీలింగ్ కలిగింది.
నాకు అప్పుడు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. నాలుగు రోజులు నేను ఇంటి గడప కూడా దాటలేదు. అంతగా బాధ పడ్డాను. అయితే ఆ సినిమాలో నటించినందుకు ఇప్పటికీ నేను ఆనందంగానే ఫీల్ అవుతాను. కానీ, నాకు చెడ్డ పేరు రావడానికి బదులు.. ఆ సినిమాకి మంచి పేరు వచ్చి ఉంటే నేను ఎంతగానో సంతోషించే దాన్ని. కానీ అలా జరగలేదు. ఏది ఏమైనా నేను ఏమి చేసినా నటన పై ఇష్టంతోనే చేశాను’ అంటూ రాధిక చెప్పుకొచ్చింది.