ప్చ్.. ఆయనకు ఇబ్బందులు అమ్మాయిల వల్లే !

‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ వుంటుంది’ అనే విషయాన్ని ఆయన బాగా నమ్మాడు. అందుకే ఆయన ఎప్పుడూ తన వెంట ఒక స్త్రీ ఉండాలని ఆశ పడ్డాడు. పైగా సినిమా ఇండస్ట్రీలో ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయనలో ఒక స్టార్ రైటర్ ఉన్నాడు. కాకపోతే తనలోని ఆ రైటర్ కి అన్యాయం జరుగుతుందని.. తనలో ఒక నిర్మాతను వెతుక్కుని ప్రస్తుతం తన సినీ ప్రయాణాన్ని సమర్ధవంతంగా సగర్వంగా సాగిస్తున్నాడు. అందుకే అందమైన అమ్మాయిలు […]

Written By: admin, Updated On : April 26, 2021 1:59 pm
Follow us on


‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ వుంటుంది’ అనే విషయాన్ని ఆయన బాగా నమ్మాడు. అందుకే ఆయన ఎప్పుడూ తన వెంట ఒక స్త్రీ ఉండాలని ఆశ పడ్డాడు. పైగా సినిమా ఇండస్ట్రీలో ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయనలో ఒక స్టార్ రైటర్ ఉన్నాడు. కాకపోతే తనలోని ఆ రైటర్ కి అన్యాయం జరుగుతుందని.. తనలో ఒక నిర్మాతను వెతుక్కుని ప్రస్తుతం తన సినీ ప్రయాణాన్ని సమర్ధవంతంగా సగర్వంగా సాగిస్తున్నాడు. అందుకే అందమైన అమ్మాయిలు వెంట పడే స్థాయిలో ఆయన ఉన్నాడు

స్వతహాగా ఆయన టాలెంటెడ్ కావడంతో ఆయన నమ్మిన దాన్ని నిజం చేయడానికి అమ్మాయిలు కూడా మొహమాట పడకుండా ముందుకు వచ్చారు. తన స్టార్ డమ్ ను చూసి వస్తోన్న అమ్మాయిలు కాబట్టి.. వాళ్ళ పై అతనికి పెద్దగా బావాలు ఉండేవి కావు. అయినా, నచ్చిన అమ్మాయిని వెనుక వుంచుకోవడం కన్నా కిక్ ఇక ఏముంటుంది ? కాకపోతే ఇక్కడే ఆయన పొరపాటు పడ్డాడు. సామెతలో పెద్దవాళ్ళు నచ్చిని అమ్మాయి అని అన్నారు.

కానీ ఈయన వచ్చిన అమ్మాయి అని తప్పుగా భావించాడు. దాంతో వచ్చే అమ్మాయిలకు పోయే అమ్మాయిలకు మధ్యలో రోజురోజుకూ అడ్డుగోడలు లేకుండా పోయాయి. దాంతో ఆయన పై నెగిటివ్ కామెంట్లు పెరిగిపోయాయి. దీనికితోడు వచ్చే అమ్మాయిని పక్కన వుంచుకుంటే ఇంకా మంచింది, చక్కని రిలీఫ్ దొరుకుతుందని పబ్లిక్ గా తన దగ్గరకు వచ్చే శిష్యులకు తాగి క్లాస్ లు చెప్పేవాడు.

అందరు శిష్యులు ఒకేలా ఉండరు కదా, అందులో ఒకడు గురువుగారి గురించి చెడుగా డప్పు కొట్టాడు. ఆ డప్పు కాస్త, చేరకూడని చోటుకు చేరింది. దాంతో ఆ రైటర్ ప్లస్ నిర్మాత ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడు. బయట వాళ్ళ నుండి ఇబ్బందులు ఎదురైతే లీగల్ గా వెళ్లొచ్చు, స్వంత ఇంట్లో తనకు ఇలాంటి పరిస్థితి వస్తోందని ఊహించని ఆయన, తన సంపాదన అంతా భార్య దగ్గర పెట్టాడు. ఆమె ఇప్పుడు డబ్బులు ఇచ్చేలా లేదు. దాంతో ‘ప్రతి మగాడి ఇబ్బంది వెనుక ఓ స్త్రీ వుంటుంది’ అని అర్ధం చేసుకున్నాడు ఆ రచయిత.