
స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్ అయితే, ఇక ఆ సినిమాల నిర్మాతలు నిండా మునిగిపోయినట్టే. ఆ నిర్మాత భవిష్యత్తు పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది ఆ ప్లాప్ టాక్. ఒక్కోసారి కోలుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదు. అందుకే నిర్మాతలు ఆ స్థాయిలో నష్టపోతే, ఇక ఆదుకునే హీరోలు కూడా ఉండరు. అయితే కొంతమంది స్టార్లు మాత్రం వారిని ఆదుకోవడానికి ముందుకువస్తారు.
ఆ కొందరు అగ్ర హీరోలలో ఇప్పటివరకూ చాలా సందర్భాల్లో డబ్బును వెనక్కి ఇచ్చిన హీరోల లిస్ట్ లో రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.
ఐతే, ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్లకు పైగానే ఖర్చు చేసిన అభిషేక్ నామా, ఈ సినిమా డిజాస్టర్ టాక్ తో దాదాపు 80% వరకు నష్టపోయాను అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయినా బన్నీ మాత్రం ఎలాంటి సపోర్ట్ చేయలేదు అని స్పష్టం చేసాడు. అలాగే మహేష్ బాబు గురించి కూడా మాట్లాడుతూ మహేష్ సినిమాలను కొనుక్కున్నప్పుడు కొన్ని దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.
అయితే అప్పుడు మహేష్ పిలిచి మరి ఆర్థికంగా కొంత సపోర్ట్ చేశారు. ఆ విధంగా ఇండస్ట్రీలో తనకు నష్టపోయిన సమయంలో మహేష్ మాత్రమే హెల్ప్ చేసినట్లు కూడా అభిషేక్ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ ఇప్పటికే చాలామంది నిర్మాతలకు సాయం అందించాడు.