‘పవన్’ అభిమానాలు గర్వంగా సగర్వంగా.. !

కరోనా అంటే అమెరికాలో మొదటి నుండి కాస్త ఎక్కువుగానే భయం ఉంది. పైగా అక్కడ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి శాతం కూడా ఎక్కువే. అందుకే అమెరికాలో సినిమాల పరిస్థితి ఇంకా పూర్తి ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’. అన్నిటికీ మించి అక్కడ ఇప్పటికీ థియేటర్లలో ఇంకా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వలేదు. కేవలం 50 నుంచి 75 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్ ఉంది, […]

Written By: admin, Updated On : April 11, 2021 3:53 pm
Follow us on


కరోనా అంటే అమెరికాలో మొదటి నుండి కాస్త ఎక్కువుగానే భయం ఉంది. పైగా అక్కడ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి శాతం కూడా ఎక్కువే. అందుకే అమెరికాలో సినిమాల పరిస్థితి ఇంకా పూర్తి ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’. అన్నిటికీ మించి అక్కడ ఇప్పటికీ థియేటర్లలో ఇంకా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వలేదు. కేవలం 50 నుంచి 75 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్ ఉంది, కాబట్టి.. ‘వకీల్ సాబ్’ మూడు లక్షల డాలర్లకు మించి వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యమే అని భావించాయి ట్రేడ్ వర్గాలు.

కానీ, ఆశ్చర్యకరంగా ప్రీమియర్ షోల నుండే ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ సునామీతో స్టార్ట్ అయ్యాడు. ఒక్క ప్రీమియర్ షోలతోనే 297k డాలర్ల వసూళ్లను రాబడుతుందని.. దిల్ రాజు టీమ్ కూడా ఊహించలేదు. అందుకే అమెరికా రైట్స్ ను కాస్త తక్కువ ధరకే అమ్మారు. మొత్తం మీద ఈ ఏడాది ఇంత భారీ మొత్తం పొందిన ఏకైక ఇండియన్ మూవీగా ‘వకీల్ సాబ్’ నిలవడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాలు గర్వంగా సగర్వంగా చాటి చెప్పుకునే అంశమే.

పైగా తమిళ నెంబర్ వన్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’కి వకీల్ సాబ్ కి వచ్చిన కలెక్షన్స్ లో సగం కూడా రాకపోవడం విశేషం. విజయ్ ఒకవిధంగా స్టార్ డమ్ లో పవన్ కి సమానమే. అలాగే మాస్టర్ సినిమా కూడా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. అయినా పవన్ స్టామినా విజయ్ స్టార్ డమ్ కి రెట్టింపు అయిందనుకుంటా. దీనిబట్టి పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ అంచనాలకు అందినది అనుకోవాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ వల్ల ఈ కోవిడ్ పరిస్థితులలో కూడా నిర్మాతలకు బయ్యర్లకు కాసుల పంట పడటం వారి అదృష్టం. ఎందుకో క్రిటిక్స్ కూడా పవన్ పైన ఉన్న అభిమానంతోనేమో చాల పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు.