
తెలుగు సినిమా రచయితల్లో పరుచూరి బ్రదర్స్ ది ఉన్నతమైన స్థానం. పైగా రచయిత స్థాయిని పెంచిన ఘనత కూడా వారికే సొంతం. కాగా వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో అప్పటి విషయాలను ఆసక్తికరంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా నాటి విలన్ రాజనాల గురించి పరుచూరి ఒక ఇంట్రస్టింగ్ విషయం చెప్పుకొచ్చారు.
Also Read: ఎన్టీఆర్ కి అత్తని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ !
ఆ రోజుల్లో జానపద సినిమాలు ఎక్కువ. వాటిల్లో ఎన్టీఆర్ హీరో అయితే, కచ్చితంగా రాజనాలే విలన్‌గా ఉండేవారు. వీళ్లది ఎంతో అద్భుతమైన కాంబినేషన్. అందుకే వీరి కలయికలో ఎన్ని సినిమాలు వచ్చినా సూపర్ హిట్ అయ్యేవి. అయితే ముఖ్యంగా ‘బందిపోటు’ చిత్రంలో అద్దం ముందు నటించే ఒక సన్నివేశం ఉంటుందట. ఈ సన్నివేశం షూట్ చేసేటప్పుడు పరుచూరికి మంచి అనుభూతి కలిగిందట. గోపాల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘అన్నగారు అద్దం అవతలివైపు ఉంటే రాజనాలగారు ఇవతలివైపు ఉండి తనే అన్నగారు అనుకుని భ్రమపడుతూ నటించిన విధానం నేను ఎన్నటికీ మరువలేను. అంత అద్భుతంగా రాజనాల చేశారు. ఆ సినిమా చూసినప్పుడల్లా నాకు ఆయనే గుర్తుకువస్తారు. అని చెప్పారు.
Also Read: ‘గాడ్ ఫాదర్’గా బాలయ్య.. ఆనందంలో ఫ్యాన్స్ !
ఇక ‘బందిపోటు’ చిత్రం ఆ రోజుల్లో ఒక మ్యూజికల్ క్లాసిక్. ఆ చిత్ర కథను చరిత్ర నుంచి తీసుకుని జానపదంగా మార్చడం జరిగింది. అసలు మూలం ‘గోన గన్నారెడ్డి’ కథ అట. ఈ చిత్ర రచయిత మహారథి ఇదే కథాంశంతో ఆ తరువాత ‘సింహాసనం’ చిత్రాన్ని రాశారు. విచిత్రంగా అదీ సూపర్ హిట్ అయింది. ఇక రచయితగా, నటుడిగా రాణించిన గోపాల్ కృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటునందుకు ఆయనకు అభినందనలు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్