నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న సౌత్ డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత ‘ప్రశాంత్ నీల్’దే మొదటి స్థానం. కాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆసక్తికరమైన గాసిప్ ఏమిటంటే ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జరుగుతుందని తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జరిగిన కొన్ని పరిస్థుతుల ఆధారంగా కథ మొదలవుతుందట. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పైనే కమల్ హాసన్ తన “విశ్వరూపం” సినిమా తీశాడు. ఆ యుద్ధంలో కొన్ని ఊహించిన పరిణామాలు జరిగాయని కొందరి వాదన. అయితే, కమల్ మాత్రం తన సినిమాలో కేవలం కొన్ని మాత్రమే చుపించాడట. అందుకే, ప్రశాంత్ నీల్ ఆ నేపథ్యంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
కథ విషయానికి వస్తే.. అల్ ఖైదా, డర్టీ బాంబు లాంటి క్లిష్టమైన, కష్టమైన అంశాలను ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ప్రభావితం చేసి వాటిని లేకుండా చేశాడు అనేది మెయిన్ కథ. కథ చాలా మలుపులు తిరుగుతుందట. అయితే, ఇక్కడ ఒక సమస్య ఉంది. మన సగటు ప్రేక్షకులకి ఏ మాత్రం ఎక్కని కథ ఏదైనా ఉందా అంటే.. అది ఈ తీవ్రవాదుల పై తీసే కథలే.
అందుకు ఉదాహరణ.. కమల్ హాసన్ సినిమాలే. కమల్ సినిమాలన్నీ నేపథ్య పరంగా ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. కానీ సినిమాలో మాత్రం ఎప్పుడూ తుస్సుమనిపిస్తాడు. దశావతారం సినిమా కూడా అంతే. మొదటి పది నిమిషాలు ఆ సినిమా చాలా బాగుంటుంది. కానీ తర్వాత అంతా బోరే. అలాగే విశ్వరూపం సినిమా కూడా. పైగా ఆ సినిమాలో ఆఫ్ఘనిస్తాన్ సమస్యలను చూపించడంలో కూడా కమల్ ఫెయిల్ అయ్యాడు.