నాగ్ తొందరపాటు మాటలు.. వైల్డ్ డాగ్ కి మైనస్ !

కింగ్‌ నాగార్జున ఎంతో ముచ్చట పడి అషిషోర్‌ సాల్మన్‌ అనే రచయిత దర్శకత్వంలో చేసిన సినిమా ‘వైల్డ్‌డాగ్’. కాగా ఏప్రిల్‌ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న సంద‌ర్భంగా మేకర్స్ ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగార్జున కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. నాగ్ మాట్లాడుతూ.. ‘ ఏసీపీ విజయ వర్మ పాత్ర నచ్చడంతోనే వైల్డ్ డాగ్‌కు ఓకే చెప్పాను. ఆయన మంచి టీం లీడర్, మంచి భర్త, […]

Written By: admin, Updated On : March 29, 2021 9:58 am
Follow us on


కింగ్‌ నాగార్జున ఎంతో ముచ్చట పడి అషిషోర్‌ సాల్మన్‌ అనే రచయిత దర్శకత్వంలో చేసిన సినిమా ‘వైల్డ్‌డాగ్’. కాగా ఏప్రిల్‌ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న సంద‌ర్భంగా మేకర్స్ ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగార్జున కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. నాగ్ మాట్లాడుతూ.. ‘ ఏసీపీ విజయ వర్మ పాత్ర నచ్చడంతోనే వైల్డ్ డాగ్‌కు ఓకే చెప్పాను. ఆయన మంచి టీం లీడర్, మంచి భర్త, మంచి తండ్రి. ఆయన ప్రేమించిన దానికి ఏం చేసేందుకైనా రెడీగా ఉంటారు. ఆయన భారతదేశాన్ని ప్రేమించారు. దాని కోసం ఏమైనా చేస్తారు. నాకు కూడా అలానే ఉంటుంది. కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త బ్లెడ్, కొత్త ఎనర్జీ కోసం ప్రయత్నిస్తుంటాను. యంగ్ వాళ్లతో పని చేస్తుంటాను కాబట్టే.. ఇలా నేను యంగ్‌గా ఉంటాను అంటూ చేసిన కామెంట్స్ బాలయ్యను ఉద్దేశించే అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఒక రకంగా ఆలోచిస్తే.. మూసధోరణి పాత్రలు, సినిమాలు చేసేది బాలయ్య మాత్రమే అని, అందుకే నాగ్ బాలయ్యను దృష్టిలో పెట్టుకునే ఈ ఆరోపణలు చేసి ఉంటాడని, మొత్తానికి రూమర్స్ అయితే మొదలైపోయాయి. అలాగే నాగ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు బోర్ కొట్టిన పనులు, సినిమాలు మళ్లీ చేయను. నేను పోషించిన పాత్రల్లో ఇది చాలా బలమైన క్యారెక్టర్. ఈ పాత్ర కోసం రాసిన డైలాగ్‌లు నా గుండెల్లోనే ఉంటాయి. నేను వైల్డ్ డాగ్ కాదు. నిర్మాత నిరంజన్ రెడ్డి అసలు వైల్డ్ డాగ్. క్షణం, ఘాజీ లాంటి కొత్త కొత్త సినిమాలను తీస్తుంటారు. నిరంజన్ రెడ్డి గారు ఈ కథను తీసుకొచ్చారు కాబట్టే ఈ చిత్రాన్ని చేశాను” అంటూ మరో కామెంట్ చేశాడు.

సరిగ్గా గమనిస్తే.. ఈ కామెంట్ లో సినిమా పై నాగ్ కి ఎక్కడో డౌట్ ఉండబట్టే ఇలాంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు అంటూ దురాభిమానుల సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు. అయితే ఇందులో కూడా కొంత నాగ్ తొందరపాటు కనిపిస్తోంది. నిరంజన్ రెడ్డి నిర్మాత కాకపోయి ఉంటే, ఈ సినిమా చేసేవాడ్ని కాదు అన్న సెన్స్ లో మాట్లాడిన నాగ్, ఇక కథను నమ్మింది ఎక్కడా ? అంటే కథ అంత గొప్పది కాదు, కేవలం నిర్మాత కోసమే ఈ సినిమా చేశాను అని ఇన్ డైరెక్ట్ గా నాగార్జున చెప్పినట్టే కదా. ఏంటో నాగార్జున కూడా ఈ మధ్య ఆలోచించకుండా మాట్లాడేసి.. మొత్తానికి విమర్శకులకు పని చెబుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్