నాడు ఎన్టీఆర్.. నేడు జగన్..

సామాన్యులను చట్ట సభలకు పంపిన ఘనత ఒకప్పుడు ఎన్టీఆర్ కు ఉండేది. చీపురుకట్టలను పెట్టినా గెలిపిస్తారనే పేరు ఉండేది. ఇప్పుడు అలాంటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. వైఎస్ జగన్ ట్రెండ్ ను ఫాలో కాకుండా.. ట్రెండ్ ను సృష్టిస్తాడు. ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే 2019లో 151 సీట్లతో అయన అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అది మాములు విషయం కాదు. అప్పటికే రాష్ట్రమంతా పసుపు జెండాలతో పరుచుకున్న తెలుగుదేశాన్ని ఓడించాడు. అలాంటి […]

Written By: NARESH, Updated On : March 29, 2021 9:54 am
Follow us on

సామాన్యులను చట్ట సభలకు పంపిన ఘనత ఒకప్పుడు ఎన్టీఆర్ కు ఉండేది. చీపురుకట్టలను పెట్టినా గెలిపిస్తారనే పేరు ఉండేది. ఇప్పుడు అలాంటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. వైఎస్ జగన్ ట్రెండ్ ను ఫాలో కాకుండా.. ట్రెండ్ ను సృష్టిస్తాడు. ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే 2019లో 151 సీట్లతో అయన అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అది మాములు విషయం కాదు. అప్పటికే రాష్ట్రమంతా పసుపు జెండాలతో పరుచుకున్న తెలుగుదేశాన్ని ఓడించాడు. అలాంటి వ్యక్తి ఒకరి ఇమేజ్ తోనో.. ఒకరి దయా దాక్షిణ్యాలతోనో పార్టీ గెలవాలనుకునే వ్యక్తి కాదని అర్థమవుతోంది. ప్రజలే తన ఇమేజ్ గా భావించి తాను పెట్టిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తుంటాడు.

2014,2019 ఎన్నికల్లో ఆయన పెద్ద పెద్ద నాయకులతోనే పోటీ పడ్డాడు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ మట్టి కరిచింది. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకులు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే వారు తమకు కావాల్సిన టికెట్ ను డిమాండ్ చేశారు. దీనికి జగన్ టికెట్ ఆశలేమీ పెట్టుకోకండి.. మా పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు.. సెకండ్ క్యాటగిరీ నాయకులను కూడా గెలిపించుకుంటామనే ధీమాలో ఉండేవారు. అయితే 2014లో ఇక టికెట్ రాదని భావించిన వారు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. దీంతో వైసీపీకి అప్పుడు అనుకున్నన్ని సీట్లు రాలేదు. ఇక కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నవారు అదృష్టం కొద్దీ గెలిచారు.

2019 ఎన్నికల విషయానికొస్తే ఎంతో మంది సామాన్యులు, అసలు మేము చట్టసభలకు పోతామా..? అని అనుకున్నవారిని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను చేశారు. ఇందులో చాలా మంది ఎంపీలు కూడా అలాంటివారే ఉన్నారు. గోరంట్ల మాధవ్, నందిగాం సురేశ్ లను పార్లమెంట్ హాల్ కు పరిచయం చేసిన ఘనత జగన్ దే. ఒకప్పుడు ఎన్టీఆర్ కు ఉండే ఆ పేరును ఇప్పుడు జగన్ సాధించాడు. ఇలా అసెంబ్లీ, పార్లమెంట్ కు పంపించి జగన్ రికార్డు సాధించాడు.

తాజాగా జగన్ పొలిటికల్ యూనివర్సిటీ నుంచి మరో క్యాండేట్ వచ్చాడు. డాక్టర్ మద్దెల గురుమూర్తి. చిత్తూరు జిల్లా ఏట్పేడు మండలం మన్నసముద్రంలో ఆయన జన్మించాడు. దళిత కుటుంబంలో పుట్టి, ఫిజియోథెరపిస్టు డాక్టర్ అయ్యాడు. ఇక జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్రలో జగన్ ఈ ఫిజియోథెరపిస్ట్ ను వెంటబెట్టుకొని వెళ్లాడు. జగన్ కు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈయన సేవలందించాడు. పాదయాత్ర ముగిసిన తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఆ తరువాత ఫిజియోథెరపిస్ట్ ను మరిచిపోలేదు. దీంతో గురుమూర్తిని ఏదోరకంగా ఉన్నతంగా చూడాలని జగన్ నిర్ణయించుకున్నాడు.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణం చెందడంతో ఆ లోక్ సభ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యలకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉండేది. కానీ ఆయన కుటుంబ సభ్యులను ఎన్నికల్లో నిలబడితే సానుభూతి ఓట్లు వస్తాయే తప్ప పార్టీ గెలిచిందన్న భావన ఉండదని జగన్ భావించారు. దీంతో జగన్ కొత్తగా ఆలోచించి దుర్గా ప్రసాద్ కొడుకు కళ్యాన్ చక్రవర్తికి ముందుగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాడు.

ఇక పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి అవకాశం ఇచ్చాడు. దీంతో తనకు అవకాశం వస్తుందని అనుకోని గురుమూర్తికి ఎన్నికల బరిలో నిల్చోబెట్టడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక తిరుపతి ఎంపీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు గురుమూర్తిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో గురుమూర్తి ఎన్నిక సునయాసమేనన్న విషయం అర్థమవుతోంది. ఇలా నాడు ఎన్టీఆర్.. నేడు జగన్ ముక్కు మొహం కూడా తెలియని సామాన్యులకు అందలం ఎక్కిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.