‘నాగార్జున హీరో అట, ఈడూ ఈడి బిల్డప్’ !

ఆ రోజుల్లో తెలుగు సినిమాల షూటింగ్స్ ఎక్కువగా మద్రాసులో జరిగేవి. వాహినీ స్టూడియోలో ‘ఖైదీ నెంబర్‌ 786’ అనే తెలుగు సినిమా షూట్ జరుగుతుంది. ఒక పాతికేళ్ల కుర్రాడు, ఆ షూట్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అతను వచ్చి అప్పటికే గంటసేపు అయింది. పక్కనున్న బాయ్స్ ఆ కుర్రాడి గురించే మాట్లాడుకుంటున్నారు. ‘ఆడు డైరెక్టర్ అట, సినిమా చేస్తున్నాడట. హ్హిహ్హి’ అని వెకిలిగా నవ్వుతూ… ‘నాగార్జున హీరో అట, ఈడూ ఈడి బిల్డప్’ అంటూ బాయ్ […]

Written By: admin, Updated On : May 21, 2021 6:10 pm
Follow us on


ఆ రోజుల్లో తెలుగు సినిమాల షూటింగ్స్ ఎక్కువగా మద్రాసులో జరిగేవి. వాహినీ స్టూడియోలో ‘ఖైదీ నెంబర్‌ 786’ అనే తెలుగు సినిమా షూట్ జరుగుతుంది. ఒక పాతికేళ్ల కుర్రాడు, ఆ షూట్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అతను వచ్చి అప్పటికే గంటసేపు అయింది. పక్కనున్న బాయ్స్ ఆ కుర్రాడి గురించే మాట్లాడుకుంటున్నారు. ‘ఆడు డైరెక్టర్ అట, సినిమా చేస్తున్నాడట. హ్హిహ్హి’ అని వెకిలిగా నవ్వుతూ… ‘నాగార్జున హీరో అట, ఈడూ ఈడి బిల్డప్’ అంటూ బాయ్ ఆ కుర్రాడి వైపు హేళనగా ఒక చూపు చూశాడు.

కానీ, ఆ కుర్రాడు మాత్రం ఏదో లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కాసేపు లోపల జేబులో బాగా నలిగిపోయిన ఓ పేపర్ తీసుకుని, దాని మీద ఏవేవో పిచ్చి గీతల్లా గీస్తూ ఏదో సిన్సియర్ గా రాసుకుంటున్నాడు. అంతలో, కోట శ్రీనివాసరావు పై షాట్ ముగిసింది. అప్పటికే మధ్యాహ్నం మూడున్నర అయింది. బాయ్‌ వచ్చి ‘ఒక కుర్రాడు మీకోసం వెయిట్‌ చేస్తున్నాడండీ. హైదరాబాద్‌ నుంచి వచ్చాడట’. ‘ఎవరయ్యా ?, తెలియదు అండి, డైరెక్టర్ అని చెప్పాడు.

ఆ మాటకి కోట షాక్ అయి, ‘కుర్రాడు డైరెక్టరా ? ఎవరై ఉంటారు ?’ అనుకుంటూ ఆ కుర్రాడిని కలవడానికి సెట్ బయటకు వచ్చాడు. వచ్చి ఎదురుగా చూస్తే బక్కపలచని కుర్రాడు కనిపించాడు. కోటను చూడగానే అతను ఎదురుగా వచ్చి ‘నమస్కారమండీ’ అంటూ నిలబడ్డాడు. ‘ఎవరయ్యా నువ్వు ?’ అని అడుగుతుండగానే.. ‘నా పేరు రామ్‌ గోపాల్‌ వర్మ సర్. నేను ప్రజెంట్ నాగార్జునగారితో ఓ సినిమా చేస్తున్నాను. సినిమా టైటిల్‌ ‘శివ’.

అందులో మీకో క్యారెక్టర్ ఉంది, దాని గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు చేయండి, మీకు మంచి పేరు వస్తోంది’ అని చెబుతూ పోతున్నాడు కుర్ర ఆర్జీవీ. ఒకపక్క ఏమో కోటకు ఎక్కడో అనుమానం. మనిషి చూస్తే పిల్లాడిలా ఉన్నాడు, వీడు డైరెక్టర్ ఏమిటి ? అనే డౌట్ కోటను మరింతగా ఇబ్బంది పెడుతుంది. కుర్ర ఆర్జీవీ కోట అనుమానం అర్థమైంది అనుకుంటా.. వెంటనే, బయట ఉన్న మేనేజర్ ను పిలిచి, అడ్వాన్స్ ఇప్పించాడు. కోటకి క్లారిటీ వచ్చింది. శివ సినిమా చేశాడు. అవార్డు కూడా అందుకున్నాడు.