Tollywood : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ డిజిటల్ శాటిలైట్ హక్కుల కోసం రూ.250 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి రూ.350 కోట్లు ఖర్చు కాగా, ఇప్పటికే నిర్మాతలకు 70 శాతం రిటర్న్స్ వచ్చాయట. కరోనాతో పలు వాయిదాలు పడిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. వైవిధ్య భరిత సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక మైన స్థాన్నాన్ని ఏర్పరుచుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. రాజావారురాణిగారు, SR కళ్యాణమండపం వంటి సినిమాలతో వరుసగా హిట్లను సాధించాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం సెబాస్టియన్ పిసి 524. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదలచేశారు.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ”ఖిలాడీ”. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, హీరోయిన్లు మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి నటిస్తున్నారు.

ఏ స్టూడియోస్ ఎల్ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని క్యాచ్ మీ అంటూ సాగే ఓ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది.