Priyanka Chopra and Nick Jonas reportedly welcome a baby : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా – నిక్ జొనాస్ జంట సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక పుట్టిన బిడ్డ ఆడపిల్ల అనే విషయం బహిర్గతమైంది. తాజాగా పాపకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో లీకయ్యాయి. అందులో ప్రియాంక, జొనాస్ తమ ముద్దుల బేబీని ఎత్తుకుని ఉన్నారు. కాగా, ఈ ఫొటోలు ఎవరు లీక్ చేశారో తెలీదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ దంపతులకు జన్మించిన ఆడబిడ్డ పుట్టాల్సిన సమయం కంటే 12 వారాలు ముందే జన్మించిన ఆ శిశువు సౌథర్న్ కాలిఫోర్నియా హాస్పిటల్‌లో ఉంది. ఇండియాకు వచ్చేంత వరకు మరికొంతకాలం ఆసుపత్రిలోనే ఉండనుందని డైలీ మెయిల్ కథనం ప్రచురించింది. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది . మొత్తమ్మీద ఈ గ్లోబల్ బ్యూటీ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
నిక్ తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించగానే ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ప్రియాంక చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ ప్రత్యేక సందర్భంలో మాకు ప్రైవసీ కల్పించి మేము ఫ్యామిలీపై ఫోకస్ పెట్టేందుకు సహకరించగలరు. అందరికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ కూడా పెట్టింది.
ఇక ప్రియాంకకు ఇండియాలో కోట్లల్లో ఆస్తులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై, గోవాలో విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి. హీరోయిన్ గా ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ తో గోవాలో ఓ విలువైన విల్లాను కొనుక్కుంది. అయితే, గత ఏడాది ఆస్తులు అన్ని అమ్మేసుకుంది. అన్నట్టు సరోగసీ విధానంలో బిడ్డ కనడానికి ప్రియాంక చోప్రా భర్త నికో జోనస్ ఇష్టం లేదు.