Harish Shankar : స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హిందీలో తన తొలి మూవీని బన్నీ హీరోగా చేస్తున్నాడట. ఈ సినిమాను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను హరీశ్ హిందీలో రీమేక్ చేయనున్నాడట. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని టాక్.

కాగా, ఈ సినిమా కథను తాజాగా హరీష్ శంకర్ బన్నీను కలిసి చెప్పాడు. ఈ సందర్భంగా బన్నీతో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “మేమిద్దరం కలిసినప్పుడు ఎప్పుడూ కూడా ఓ రేంజ్లో ఫన్ ఉంటుంది. మనం మళ్ళీ కలిసే వరకు ఒక గ్రేట్ టైం దొరికింది అల్లు అర్జున్.. తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి?” అంటూ పోస్ట్ చేశాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పట్ల పవన్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హరీష్ తో సినిమా అంటే.. అభిమానులకు పండగే. ఎందుకంటే.. ఒక అభిమాని పవన్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. హరీష్, పవన్ తో సినిమా చేస్తే అలా ఉంటుంది. అందుకే, వీరి కలయికలో వచ్చే సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు తాజాగా ఈ సినిమా పై పవన్ నుంచి క్లారిటీ వచ్చింది. క్లారిటీ అంటే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాల్లో అన్నమాట.
మార్చి మూడో వారం నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే రిలీజ్ విషయానికి వస్తే.. 2023 సంక్రాంతికి హరీష్ శంకర్ – పవన్ తమ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. పైగా ఈ సినిమాలో వెరీ పవర్ ఫుల్ రోల్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.