
మెగా స్టార్ చిరంజీవి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టేశాడు. 60 ఏళ్లు వచ్చినా తనలోని గ్రేసు తగ్గలేదని నిరూపించాడు. చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ ‘ఆచార్య’. ఈ చిత్రానికి దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాంచరణ్ ఫస్ట్ లుక్ కూడా అలరించింది.
ఈ క్రమంలోనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘లాహే లాహే’ అన్న సాంగ్ విడుదలైంది. ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఆయన నుంచి చాలా రోజుల తర్వాత ఒక క్లాసి పాట వచ్చింది.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నక్సలైట్ల బ్యాక్ డ్రాప్ ను ఇందులో అమర్చారు. చిరంజీవి, రాంచరణ్ మావోయిస్టులుగా ఇందులో కనిపించనున్నారు.
ప్రస్తుతం విడుదలైన పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక గుడి ముందు మహిళలు, చిరంజీవి స్టెప్పులు వేసిన తీరు ఆకట్టు కుంది. సాంగ్ ను మీరూ చూసేయండి..
