మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు నేడు. మెగా ఫ్యాన్స్ కు ఇది పండుగ రోజు. చిరంజీవి నటవారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. ‘చిరుత’తో మొదలు పెట్టి మగధీరతో హిట్కొట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
తండ్రి సపోర్టుతో వచ్చినా.. కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
రాంచరణ్ 36వ పుట్టినరోజు నేడు. ఆర్ఆర్ఆర్ నుంచి ఆయన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ రెండు రోజుల ముందు నుంచే సంబరాలు స్టార్ట్ చేశారు.
రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వారితో చరణ్ సెల్ఫీ తీసుకొని మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ప్రస్తుతం ఈ మెగా సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ నుంచి రాంచరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.