
ఈ మధ్య కాలంలో బయోపిక్ ల ట్రెండ్ కి కాస్త బ్రేక్ పడింది అనుకున్నే లోపే మళ్ళీ మరో క్రేజీ బయోపిక్ రెడీ అవుతుంది. పైగా ఈ బయోపిక్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బి ఎస్పీ అధినేత మాయావతిది. అసలు మాయావతి అంటేనే ఒక విప్లవం. మాయావతి జీవితాన్ని వెండితెర మీదకు తీసుకురావడానికి రెండు సంవత్సరాల నుండి చాలమంది నార్త్ ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేసినా.. ఆ కథ పై అనేక ఆంక్షలు ఉంటాయి, పైగా అటు ఇటు తేడా జరిగితే మాయావతి అభిమానుల కోపాగ్నికి నలిగిపోవాల్సి వస్తోందని చాలామంది ఈ బయోపిక్ నుండి సైలెంట్ గా తప్పుకున్నారు.
అయితే ఇన్నాళ్లకు మళ్ళీ ఈ బయోపిక్ ఉండబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీదీ గా క్రేజ్ తెచ్చుకున్న మాయావతి జీవిత కథతో తెరకెక్కే సినిమాలో విద్యా బాలన్ మాయావతి పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ బయోపిక్ కి సుభాష్ కపూర్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా మాయావతి జీవితంలో జరిగిన ప్రతి బలమైన సంఘటనను తన సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తా అంటున్నాడు ఈ దర్శకుడు. మరి చివరకు వివాదాల కేంద్ర బిందువుగా ఈ సినిమా తయారవుతుందేమో.
అయితే ఎన్నో ఒడిదుడుకులతో మాయావతి జీవితం సాగింది. రాజకీయాల్లోకి వచ్చాక కూడా మాయావతి పై అనేక విమర్శలు వచ్చాయి. అలాగే ఆమె చేసే ఆరోపణలు కూడా ఎన్నో సార్లు వివాదస్పదం అయ్యాయి. మొత్తానికి సంచలన చిత్రంగా మాయావతి బయోపిక్ ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎలాగూ విద్యా బాలన్ కాబట్టి మాయావతి పాత్రకు పూర్తి న్యాయం చేస్తోంది.
కాగా ఈ సినిమాని హిందీ భాషలో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనతో సినిమా చేస్తున్నారట. అందుకే ఈ బయోపిక్ లో అన్ని బాషలకు సంబంధించిన పాపులర్ నటీనటులను తీసుకోనున్నారు.