Homeఎంటర్టైన్మెంట్Krishna Vamsi And Prakash Raj: నట రాక్షసుడితో క్లైమాక్స్.. స్టన్నింగ్ ...

Krishna Vamsi And Prakash Raj: నట రాక్షసుడితో క్లైమాక్స్.. స్టన్నింగ్ !

Krishna Vamsi And Prakash Raj: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ప్రకాశ్ రాజ్ నటనా కౌశలం అంటే బాగా ఇష్టం. ప్రస్తుతం కృష్ణవంశీ తన శక్తిని అంతా ధారపోసి ‘రంగమార్తాండ’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్ ను మాత్రమే పెట్టుకుంటా అంటూ చివరకు ప్రకాష్ రాజ్ నే పెట్టుకున్నాడు. కాగా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి దమ్ము ఉన్న నటుడు ప్రకాష్ రాజ్. ఏ పాత్రలోనైనా తన నటనతో మెప్పించగలిగే సత్తా కలిగిన నటుడు ప్రకాష్ రాజ్.

Krishna Vamsi And Prakash Raj
Krishna Vamsi And Prakash Raj

అయితే, తాజాగా ‘రంగమార్తాండ’ చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ రోజు సెట్లో ప్రకాష్ రాజ్ పై కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు కృష్ణవంశీ. కాగా కృష్ణవంశీ మానిటర్ ముందు కూర్చుని, ప్రకాష్ రాజ్ కి సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తూ కనిపించాడు. ఈ ఫోటోను ట్విటర్ లో షేర్ చేస్తూ ‘మా రంగమార్తాండ చివరి అంకం మొదలైంది’ అంటూ మెసేజ్ చేశాడు.

Also Read: టాలీవుడ్ టార్గెట్ ఇప్పుడు అదే.. ఏమవుతుందో ?

Krishna Vamsi And Prakash Raj
Prakash Raj and Ramya Krishna

కాగా కృష్ణవంశీ షేర్ చేసిన మెసేజ్ లో ఆయన ఈ విధంగా రాశాడు. ‘నేను ఎంతో అభిమానించే నటుడు నా నటరాక్షసుడు ప్రకాశ్ రాజ్ తో ఎమోషనల్ క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నాను. స్టన్నింగ్.. అద్భుతం’ అంటూ కృష్ణవంశీ మెసేజ్ పోస్ట్ చేశాడు. వంశీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మురారి, ఖడ్గం, అంతఃపురం’ లాంటి చిత్రాల్లో ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించాడు.

Also Read: వారిద్దరి లవ్ కి విలన్ ‘సమంత’ మాత్రమే !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular