Tollywood Movies: కరోనా టాలీవుడ్ ని అతలాకుతలం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. 2020లో కరోనా వచ్చిన కొత్తలో.. 2021కి అయినా మంచి రోజులు వస్తాయి అనుకున్నారు. కానీ, 2021లో కరోనా దెబ్బకు, ఇక కనీసం 2022 నుంచి అయినా మంచి రోజులు వస్తాయని అనుకున్నారు. కానీ, 2022 వచ్చింది. వస్తూనే కరోనాను పట్టుకొచ్చింది . రిలీజ్ కి రెడీగా పెట్టుకున్న భారీ సినిమాలు పోస్ట్ ఫోన్ అయ్యాయి.

బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆల్ రెడీ నిర్మాతలకు డబ్బులు కట్టారు. ఇటు నిర్మాతలు ఆ డబ్బు అంతా సినిమా మీద ఖర్చు పెట్టారు. సినిమా రిలీజ్ అయితే గానీ, డబ్బులు చేతికి రావు. మొత్తమ్మీద ఇప్పుడు చాలామంది నిర్మాతలు, బయ్యర్ల బ్యాంకు బాలన్స్ మైనస్ లో పడిపోయాయని సినిమా వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా వల్ల ఏర్పడ్డ భారీ సంక్షోభం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.
కరోనా టాలీవుడ్ ని నిజంగానే అతలాకుతలం చేసి అల్లాడిస్తోంది. 2020 నుంచి 2021 మీదుగా ఇప్పుడు 2022లో కూడా చిత్రసీమ కరోనా దెబ్బలు తినడానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోందని ఎవరూ ఊహించలేదు. పరిస్థితులు ఇంకా మారిపోతాయని అంటున్నారు. అవును, నిజానికి వారం క్రితం పరిస్థితి ఇలా లేదు. కానీ ఇప్పుడు కరోనా భయం ఇండస్ట్రీలో ప్రతి ఆఫీస్ లో ఉంది.
Also Read: వారిద్దరి లవ్ కి విలన్ ‘సమంత’ మాత్రమే !
మరి వచ్చే వారం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. తెలుగు తెరకు సంక్రాంతి సీజన్ చాలా కీలకం. ఇలాంటి సీజన్ లో సినిమాలు ఆగిపోవడం నిజంగా బాధాకరమైన విషయమే. ఈ సీజన్ లో రావాల్సిన అన్ని సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఇక ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు కూడా పోస్ట్ ఫోన్ అవుతాయి అంటున్నారు.
మరి సమ్మర్ పరిస్థితి ఎలా ఉంటుందో ? సమ్మర్ కే రావాలని మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” కూడా ఫిక్స్ అయ్యాడట. ఇక “ఆర్ ఆర్ ఆర్”, “రాధే శ్యామ్”లు ఎలాగూ ఉంటాయి. మొత్తమ్మీద టాలీవుడ్ ప్రధాన టార్గెట్ మారిపోయింది.
Also Read: సంక్రాంతి జాతరలో పోటీ పడే చిత్రాలివే !