ఆయన ఒక్కడే ఆమెలోని గ్లామర్ ను చూపించాడు !

తెలుగు సినీ లోకంలో సహజమైన నటనతో.. అసలు నటి అంటేనే సహజత్వం ఉండాలనే అంతగా పేరు తెచ్చుకున్న నటీమణులు మనకు చాలామంది ఉన్నారు. అప్పటి భానుమతి దగ్గర నుండి, ఇప్పటి సాయి పల్లవి వరకూ తమ హవాబావాలతో ప్రేక్షకులను ఉహల ప్రపంచంలో విహరింపజేసినా అందాల తారలు ఇలా ఎందరో ఉన్నారు. వారి అందరిలో కల్లా తెలుగులో సహజ నటి అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నటి ‘జయసుధ’. ఎన్నో సినిమాల్లో, మరెన్నో భాషల్లో మహానటి సావిత్రిగారి తర్వాత […]

Written By: admin, Updated On : April 22, 2021 8:39 am
Follow us on


తెలుగు సినీ లోకంలో సహజమైన నటనతో.. అసలు నటి అంటేనే సహజత్వం ఉండాలనే అంతగా పేరు తెచ్చుకున్న నటీమణులు మనకు చాలామంది ఉన్నారు. అప్పటి భానుమతి దగ్గర నుండి, ఇప్పటి సాయి పల్లవి వరకూ తమ హవాబావాలతో ప్రేక్షకులను ఉహల ప్రపంచంలో విహరింపజేసినా అందాల తారలు ఇలా ఎందరో ఉన్నారు. వారి అందరిలో కల్లా తెలుగులో సహజ నటి అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నటి ‘జయసుధ’. ఎన్నో సినిమాల్లో, మరెన్నో భాషల్లో మహానటి సావిత్రిగారి తర్వాత అంతటి స్థాయిలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఫ్యామిలీ హీరోయిన్ అంటే జయసుధనే.

నిజానికి ఆ రోజుల్లో జయప్రద, శ్రీదేవి అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నా… జయసుధ కేవలం తన కవ్వింపు చూపులతోనే వాళ్ళందరికీ గట్టి పోటీని ఇచ్చింది. అందరిలోకల్లా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే అలాంటి జయసుధను మొదట గ్లామర్ పాత్రల్లో చూపించడానికి ఆనాటి దర్శకులు బాగా ఇబ్బంది పడేవారట. ఆమెలో కమర్షియల్ హీరోయిన్ ను అసలుఅంగీకరించేవారు కాదట. ఆ రోజుల్లోనే బికినీ వేసి అప్పటి యూత్ కి ఆమెలోని గ్లామర్ ను పరిచయం చేసినా.. ఆమెను మాత్రం ఎక్కువుగా ఫ్యామిలీ హీరోయిన్ గానే చూశారట.

పైగా జయసుధ గ్లామరస్ రోల్స్ చేసిన సినిమాలు కూడా ఎక్కువుగా ప్లాప్ అయ్యాయి. అందుకే ఆమెను కమర్షియల్ హీరోయిన్ గా అప్పటి దర్శకులు చూపించడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఒక్క దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రమే ఆమెను గ్లామర్ గా చూపించాడు. అందువల్లే జయసుధ చేసిన కమర్షియల్ సినిమాలు ఎక్కువుగా దర్శకేంద్రుడితోనే చేసింది. ఇక జయసుధ ఇప్పటికీ అమ్మగా అమ్మమ్మగా మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇంతకీ జయసుధకు ఆమె తల్లితండ్రులు పెట్టిన అసలు పేరు సుజాత.

జయసుధ చిన్నతనం అంతా చెన్నైలోనే గడిచింది. ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల జయసుధకి స్వయానా పిన్ని అవ్వడంతో.. అప్పుడప్పుడు షూటింగ్ లకు వెళ్ళేవారు. అలా ఆమెలో అనుకోకుండా నటన చేరింది. అలా ఆమె జీవితంలోకి తెలియకుండానే సినిమా ప్రవేశించింది. అలాగే జయసుధ రాజకీయాల్లోనూ అనుకోకుండానే ప్రవేశించి ఎమ్మెల్యే కూడా అయ్యారు.