మనలో చాలామంది తక్కువ మొత్తం పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలని అనుకునే వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ చేయడం ద్వారా సులభంగా సంపాదించవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి.
సిప్ రూపంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం పొందే అవకాశంతో పాటు ఎక్కువ రాబడి వస్తుంది. 30 సంవత్సరాల వ్యక్తి నెలకు 500 రూపాయల చొప్పున సిప్ చేయాలని అనుకుని 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 34 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. రాబడిని 15 శాతంగా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం లభిస్తుంది.
ప్రతి నెలా సిప్ రూపంలో డబ్బులు దాచుకుంటూ వెళ్లడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎంచుకునే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ను బట్టి మాత్రమే మనం పొందే మొత్తం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. సరైన అవగాహన ఉంటే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో లాభాలు పొందాలనుకునే వారు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.