స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా పురిటి నొప్పులతో బాధపడుతూ కార్తీక్ సంతకం పెడితే కానీ తను ఆపరేషన్ చేయించుకోనని మోనిత పట్టుబడుతుంది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన గర్భం కృత్రిమ గర్భం కాదని, సహజంగానే కార్తీక్ వల్ల గర్భం వచ్చిందని జరిగిన విషయం చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.అప్పటికి మోనిత అబద్ధం చెబుతోందని మమ్మీ ఏంటి ఇదంతా నాకు అర్థం కావట్లేదుని అక్కడి నుంచి వెళ్తుండగా ఇదంతా కార్తీక్ కి చెప్పిన తర్వాత మోనిత స్పృహ కోల్పోతుంది. మోనిత పరిస్థితి చూసి భారతి సంతకం చేయి కార్తీక్ లేదంటే తన ప్రాణాలు పోతాయని చెబుతుంది.అప్పటికి కార్తీక్ స్పందించకపోవడంతో నువ్వు కూడా ఒక డాక్టర్ కదా ఏం చేస్తావో చేసుకో నేను వెళ్తున్నా అని భారతి వెళ్లబోతుండగా ఆగు అంటూ వెళ్లి ఆ పేపర్ తీసుకురా అని సౌందర్య చెప్పడంతో ఏంటి మమ్మీ నువ్వు కూడా అంటూ కార్తిక్ ఆవేశ పడతాడు. ముందు నువ్వు సంతకం పెట్టురా అని కార్తీక్ తో సంతకం పెట్టిస్తుండగా.. భారతి మోనితలే కార్తీక్ సంతకం చేశాడని తనకి చెప్పడంతో మోనిత ఎంతో సంతోష పడుతుంది.
సంతకం చేసిన తర్వాత మీరు బయటకు వెళ్లండి నేను ఆపరేషన్ చేస్తానని చెప్పడంతో బయటకు వెళ్ళిన సౌందర్య కార్తీక్ ఎంతో బాధపడుతూ మౌనంగా ఉండి పోతారు. ఇప్పుడేం చేయాలి బయట ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అందరికి ఎలా సమాధానం చెప్పాలని మదన పడుతుండగా భారతీ వచ్చి కంగ్రాట్స్ మగబిడ్డ పుట్టాడు..తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు తనని కాపాడినందుకు చాలా థాంక్స్ కార్తీక్ అంటూ భారతి చెబుతుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి పల్లవి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ దీప ఇంటికి వెళ్తుంది.దీపను చూసిన పిల్లలు తన దగ్గరకు వచ్చి అమ్మా బ్లడ్ రిపోర్ట్స్ కోసం వెళ్లారు అంట కదా ఏమైంది అని అడగగా అంత బాగుంది అని చెబుతూ కార్తీక్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది.
ఇక కారులో ఇంటికి బయలు దేరిన సౌందర్య కార్తీక్ ఏంటి మమ్మీ ఇప్పుడెలా ఈ విషయం తెలిస్తే పరిస్థితి ఏంటి అంటూ బాధపడతాడు.అసలే తనకు ఆత్మాభిమానం ఎక్కువ ఎన్ని చెప్పినా నన్ను క్షమించదు ప్రస్తుతం ఈ విషయం దీపకి తెలియకూడదు..ఇదే విషయాన్ని భారతికి చాలా గట్టిగా చెప్పానని కార్తీక్ చెబుతాడుఈ మాటలు విన్న సౌందర్య ఈశ్వర ఏంటి పరీక్ష మాకు అంటూనే ఏదైనా గుడి దగ్గర ఆపురా అంటుంది. దీప రావడాన్ని గమనించిన ప్రియమణి దీపమ్మా వచ్చావా ఇప్పుడు చూడు నీకు ఎలా షాక్ ఇస్తానో.. అంటూ దీపకు వినిపించేలా దేవుడా నువ్వు ఉన్నావ్.. కార్తికయ్య రూపంలో వచ్చి మా మోనితమ్మాను కాపాడావు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్న దీప దగ్గరకు వెళ్లి ఏంటి ప్రియమణి మోనిత, కార్తిక్ అంటున్నావు అంటూ అడుగుతుంది. మోనితమ్మ పురిటి నొప్పులతో బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్ళింది అంట పేగు బిడ్డ మెడకు చుట్టుకోవడంతో ఇబ్బంది పడింది అయితే కార్తీక్ బాబు సంతకం పెట్టే వరకు ఆపరేషన్ చేయించుకోనని చెప్పిందటమ్మ ఆ తల్లి బిడ్డకు ప్రాణం పోయేలా ఉందని మన కార్తీకయ్య సంతకం పెట్టి వారిని రక్షించాడట ఎంతైనా కార్తికయ్య దేవుడమ్మ పండంటి మగబిడ్డ పుట్టాడు అంట అంటూ ప్రియమణి చెప్పడంతో దీప షాక్ అవ్వగా ప్రియమణి మాత్రం మురిసిపోతుంది.అయితే తరువాత ఎపిసోడ్ లో సౌందర్య కార్తీక్ దీపం ఎలా ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.