https://oktelugu.com/

ఆ విషయంలో ఆమె తరువాతే ఎవరైనా !

కంగనా రనౌత్ అంటేనే ఓపెన్ బుక్. విమర్శల దగ్గర నుండి బెడ్ రూమ్ సీక్రెట్స్ వరకూ ఏది దాచుకోకుండా మొత్తం ఉన్నది ఉన్నట్టు వివరించే బోల్డ్ హీరోయిన్. పైగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో అక్కడి స్టార్ హీరోలను సైతం భయపెట్టగలిగే డాషింగ్ హీరోయిన్. ఎలాగూ ఏ విషయాన్నీ అయినా, ఎలాంటి బిడియం లేకుండా చెప్పి షాకుల మీద షాకులు ఇవ్వడంలో కంగనా తరువాతే ఎవరైనా. పైగా తన పర్సనల్ లైఫ్ లో తనతో మిస్ […]

Written By:
  • admin
  • , Updated On : April 6, 2021 / 02:34 PM IST
    Follow us on


    కంగనా రనౌత్ అంటేనే ఓపెన్ బుక్. విమర్శల దగ్గర నుండి బెడ్ రూమ్ సీక్రెట్స్ వరకూ ఏది దాచుకోకుండా మొత్తం ఉన్నది ఉన్నట్టు వివరించే బోల్డ్ హీరోయిన్. పైగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో అక్కడి స్టార్ హీరోలను సైతం భయపెట్టగలిగే డాషింగ్ హీరోయిన్. ఎలాగూ ఏ విషయాన్నీ అయినా, ఎలాంటి బిడియం లేకుండా చెప్పి షాకుల మీద షాకులు ఇవ్వడంలో కంగనా తరువాతే ఎవరైనా.

    పైగా తన పర్సనల్ లైఫ్ లో తనతో మిస్ బిహేవ్ చేసిన వారి గురించి చెప్పమంటే.. ఆమెకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తోంది. అలాగే తన జీవితంలో జరిగిన ఘాటు వ్యవహారాలను కూడా అంతే పచ్చిగా చెబుతుంది. కాగా కంగనా తన మొదటి అనుభవం గురించి చెప్పి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. కంగనా 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, ఓ పంజాబీ యువకుడితో ప్రేమలో పడిందట, అప్పుడు అతగాడి వయసు 28 అట.

    ఎందుకో తెలియదు గానీ, అతన్ని చూసిన మొదటిసారే చూసి చూడగానే అతనితో కంగనాకి డేట్ కు వెళ్లాలనిపించిందట. ఒకవేళ వెళ్లాలని అనిపించినా.. ప్రేమలో పడ్డాం అని చెబుతారు. కానీ, కంగనా మాత్రం ప్రేమ దోమ లాంటివి ఏమి లేకుండా డైరెక్ట్ మ్యాటర్ గురించే ఆలోచించిందట. ఎంతైనా కంగనా కదా. పైగా ఆ సమయంలో కంగనా స్నేహితురాలు ఆ వ్యక్తితో డేటింగ్ లో ఉండేది అట.

    తన ఫ్రెండ్ అతనితో డేటింగ్ చేసిన విధానం చూసే కంగనాకు అంతనితో డేటింగ్ చేయాలనీ అనిపించిందట. ఆ తరువాత ఆ పంజాబీ యువకుడితో పరిచయం పెంచుకుని.. మొత్తానికి అతనితో డేటింగ్ చేసిందట. ఇక అతనితో ఆమె తొలి ముద్దు అనుభవం చాలా వింతగా జరిగిందని, అతన్ని కిస్ చేస్తున్నపుడు కంగనా బాగా బిగుసుకుపోయియిందట. ఏమైనా ఇలాంటి విషయాలు చెప్పడంలో కంగనా తరువాతే ఎవరైనా.