AP Politics: పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో కీలకం కాబోతున్నాడా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన కోసం అటు టీడీపీ, ఇటు బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే మొన్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన కామెంట్లు ఇప్పుడు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్లు టీడీపీలో ఫుల్ జోష్ తెస్తున్నాయి.
Pavan Kalyan
ఆయన మాటల్లో టీడీపీతో పొత్తుకు సిద్ధంగానే ఉన్నట్టు అర్థమవుతోంది. దాంతో పాటే బీజేపీకి కూడా ఆయన ఓ డిమాండ్ పెట్టేశారు. తనకు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయినా.. బీజేపీ ఒక రూట్ మ్యాప్ ఇస్తానందని పవన్ చెప్పారు. అయితే బీజేపీ ఇస్తానని చెప్పి రూట్ మ్యాప్ ఏంటనే దాని మీద ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే సాగుతోంది.
Also Read: Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: అనసూయకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. కారణం అదే
అయితే ఆవిర్భావ సభకంటే ముందు టీడీపీ వచ్చి పవన్‌ను కలిసినట్టు తెలుస్తోంది. ఆయనకు టీడీపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని దానికి పవన్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. మూడేండ్లు టీడీపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే.. మరో రెండేండ్లు జనసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండేందుకు టీడీపీ ప్రతిపాదన తెచ్చినట్టు లుస్తోంది.
Pavan kalyan, Chandra babu Naidu
కాగా ముందు జనసేన అభ్యర్థి సీఎంగా ఉన్న తర్వాతే.. టీడీపీ అభ్యర్థి సీఎం అవ్వాలని పవన్ కండీషన్ పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక అటు బీజేపీ కేంద్ర పెద్దలు జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. కానీ ఇటు రాష్ట్రంలో మాత్రం పవన్‌ను అడ్డం పెట్టుకుని వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తున్నారు. దీన్ని పవన్ సుతిమెత్తగా తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్రపెద్దలు సన్నిహితంగా ఉండి, రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉండాలంటే తన వల్ల కాదని చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీ రూట్ మ్యాప్ లో టీడీపీ ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది. కాగా టీడీపీతో పొత్తుకు ఇప్పుడు పవన్ సిద్ధం అవుతున్నారు. మరి టీడీపీ, బీజేపీలను కలిపే ప్రయత్నాలు పవన్ చేస్తారా.. లేక బీజేపీకి కండీషన్లు పెట్టి ఒప్పుకోకపోతే వదిలేస్తారా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది.
Also Read: Narendra Modi: తన గెలుపు సీక్రెట్ ఏంటో చెప్పిన మోడీ!