https://oktelugu.com/

థియేటర్ల సెలెక్షన్ లో హీరోగారి తిప్పలు !

టాలీవుడ్ లో యాక్షన్ హీరో అనే ఇమేజ్ రావడం అంటే, అది పెద్ద సక్సెస్ లెక్కే. అయితే, వచ్చిన ఇమేజ్ కి న్యాయం చేయలేక నానా కష్టాలు పడుతున్నాడు హీరో గోపీచంద్. గత పదేళ్లుగా ఈ హీరోగారి కెరీర్ డైలమాలో ఉంది. అయినా పట్టుదలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఎన్ని చేసినా వరుస పరాజయాలతో విసిగిపోయాడు ఈ టాల్ హీరో. విషయం ఉన్న దర్శకులను పట్టుకుంటున్నా.. ఎందుకో గోపిచంద్ దగ్గరకి వచ్చే సరికి వారంతా తేలిపోతున్నారు. దాంతో […]

Written By:
  • admin
  • , Updated On : March 30, 2021 / 04:44 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో యాక్షన్ హీరో అనే ఇమేజ్ రావడం అంటే, అది పెద్ద సక్సెస్ లెక్కే. అయితే, వచ్చిన ఇమేజ్ కి న్యాయం చేయలేక నానా కష్టాలు పడుతున్నాడు హీరో గోపీచంద్. గత పదేళ్లుగా ఈ హీరోగారి కెరీర్ డైలమాలో ఉంది. అయినా పట్టుదలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఎన్ని చేసినా వరుస పరాజయాలతో విసిగిపోయాడు ఈ టాల్ హీరో. విషయం ఉన్న దర్శకులను పట్టుకుంటున్నా.. ఎందుకో గోపిచంద్ దగ్గరకి వచ్చే సరికి వారంతా తేలిపోతున్నారు. దాంతో గోపీచంద్ కి సీజన్ కి ఒకటి చొప్పున ప్లాప్ మిగులుతుంది.

    మధ్యలో ఒకటి రెండు మంచి కథలతో సినిమాలు చేసినా, విజయం మాత్రం దక్కలేదు. ఇలాంటి హీరోకి మంచి హిట్ సినిమా ఇవ్వాలనే కసితో టేకింగ్ లో కూడా క్రియేటివిటీని చూపిస్తూ ఒక సినిమా చేసాడు సంపంత్ నంది. పైగా గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాని హీరోయిన్ గా పెట్టి.. ఫుల్ మాస్ మసాలా టైపు కంటెంట్ తో పాటు ఎమోషనల్ గా సాగే కబడ్డీ గేమ్ ను పెట్టి “సీటీమార్” అనే టైటిల్ తో సినిమాని రెడీ చేశాడు. కాగా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే వచ్చే వారం అనగా ఏప్రిల్ 2వ తారీఖునే విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ఫోన్ అయిన సంగతి తెలిసిందే.

    కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదలపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు. దానికి తగ్గట్లు ఇప్పటికే థియేటర్స్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గోపిచందే దగ్గర ఉండి మరీ థియేటర్స్ ను సెలక్ట్ చేసుకుంటూ, నానాతిప్పలు పడుతున్నాడట. ఎంతైనా కమర్షియల్ ఏరియాలోని థియేటర్స్ కి వాల్యూ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి తన కెరీర్ కే కీలకం కావడంతో గోపీచంద్ సిటీమార్ పై చాల కేర్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మిస్తున్నారు.